- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్‌లో బీజేపీ వినూత్న నిరసన.. సమస్యలు పరిష్కరించాలని పొర్లు దండాలు
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్ (Kisan Nagar)లో బీజేపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు.

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్ (Kisan Nagar)లో బీజేపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి చేయాల్సిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు దయనీయ స్థితిలో ఉన్నాయని ఆరోపిస్తూ ఏకంగా రోడ్డుపై పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్‌లో అనేక ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అదేవిధంగా కిసాన్‌నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని తెలిపారు. ఎన్ని సార్లు సమస్యను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కిసాన్ నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వానికి పొర్లు దండాలు పెట్టారు. ఇప్పటికైనా సమస్యలను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని బీజేపీ దళిత మోర్చా నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు ఆలస్యం అవుతోన్న వేళ పొర్లు దండాల నిరసన పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.






