కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడికి చీర కట్టిన బీజేపీ నేతలు.. ఎందుకంటే?

by Malleboina Mahesh |   (  Updated:2025-09-24 06:07:44  IST  )

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడికి చీర కట్టిన బీజేపీ నేతలు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను మార్ఫింగ్ (Modi photo morphing) చేసిన చిత్రాన్ని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడు (Congress leader) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు (BJP leaders).. వెంటనే క్షమాపణ చెప్పాలని అతని ఇంటికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని డొంబివ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రకాష్ పగారే (వయసు 73) ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను సారీ లో ఉన్నట్లుగా మార్ఫ్ చేసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో వైరల్ కావడంతో రాజకీయ వివాదానికి దారి తీసింది.

ఈ చర్యపై బీజేపీ కార్యకర్తలు తీవ్ర స్పందన చూపుతూ, ప్రకాష్ పగారేను పట్టుకుని అతని ఇంటికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అతనికి చీర కట్టారు. ఈ ఘటనపై రెండు పార్టీలు తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగత గౌరవానికి వ్యతిరేకంగా 73 ఏళ్ల వ్యక్తితో ఇలా చేయడం అన్యాయం అని ఖండించారు. అదే సమయంలో, పోలీసులు ఫిర్యాదును స్వీకరించి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో రాజకీయ ఉద్రిక్తతల (Political tensions)ను మరింత పెంచినట్లైంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Next Story