- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా కొడుకు వాళ్లను కొట్టడంలో తప్పులేదు.. సమర్థించిన బీజేపీ నేత
కర్ణాటక బీజేపీ నాయకుడు విజుగౌడ పాటిల్ కుమారుడు సమర్థగౌడ పాటిల్ టోల్ సిబ్బందిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రూ. 50 టోల్ ఫీజు చెల్లించమన్నందుకు రక్తలు వచ్చేలా స్నేహితులతో కలిసి దాడి చేశాడు. తండ్రి పేరు చెప్పి ఫ్రీగా వెళ్లాలనుకున్న అతను.. సిబ్బంది ఫీజు డిమాండ్ చేసేసరికి రెచ్చిపోయాడు.

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక బీజేపీ నాయకుడు విజుగౌడ పాటిల్ కుమారుడు సమర్థగౌడ పాటిల్ టోల్ సిబ్బందిపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రూ. 50 టోల్ ఫీజు చెల్లించమన్నందుకు రక్తలు వచ్చేలా స్నేహితులతో కలిసి దాడి చేశాడు. తండ్రి పేరు చెప్పి ఫ్రీగా వెళ్లాలనుకున్న అతను.. సిబ్బంది ఫీజు డిమాండ్ చేసేసరికి రెచ్చిపోయాడు. ఈ విషయంపై తండ్రి అభిప్రాయాన్ని అడగ్గా.. కొడుకును సమర్థించుకున్నాడు. ‘నా కొడుకు.. ఇది విజుగౌడ కారు.. ఆయన తన తండ్రి అని చెప్పాడు. కానీ టోల్ సిబ్బంది విజుగౌడ ఎవరని అడిగారు. నా కొడుకు.. రెగ్యులర్‌గా వచ్చేవాడిని గుర్తుపెట్టుకోలేరా అన్నాడు. దానికి టోల్ సిబ్బంది.. ఎవరైనా టోల్ చెల్లించాలని అన్నాడు. నా కొడుకు చిరాకుపడ్డాడు. తండ్రి గురించి తప్పుగా మాట్లాడితే కోపం రావడం సహజం. సమస్యను ప్రశాంతంగా పరిష్కరించకుండా.. టోల్ సిబ్బంది గట్టిగా చెప్పారు. దీంతో నా కొడుకు కారు దిగి.. ప్రశ్నించాడు. అతను చేసిన దాంట్లో తప్పు లేదు.. తప్పు చేసింది టోల్ సిబ్బంది’ అని చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో పొట్టు పొట్టు వేసుకుంటున్నారు జనాలు.






