ఇజ్జత్ పోయిందిపో.. ప్యాంట్ వేసుకోకుండానే లైవ్ డిబేట్‌కు హాజరైన బీజేపీ జాతీయ ప్రతినిధి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-14 11:32:59  IST  )

సీనియర్ న్యాయవాది, బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియాపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. ఇందుకు కారణం ఆయన ప్యాంట్ లేకుండా ఓ ఛానల్ ప్రైమ్ టైమ్ షో

ఇజ్జత్ పోయిందిపో.. ప్యాంట్ వేసుకోకుండానే లైవ్ డిబేట్‌కు హాజరైన బీజేపీ జాతీయ ప్రతినిధి.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ న్యాయవాది, బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియాపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. ఇందుకు కారణం ఆయన ప్యాంట్ లేకుండా ఓ ఛానల్ ప్రైమ్ టైమ్ షో లైవ్ డిబేట్‌కు హాజరుకావడమే. అవును.. ఇంటి నుంచి వీడియో కాల్ ద్వారా చర్చలో పాల్గొన్న ఆయన.. కేవలం కుర్తా మాత్రమే ధరించారు. కింద ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారు. కెమెరా యాంగిల్ మారడంతో బీజేపీ నేత ఒక్కసారిగా అవాక్కయిపోయి.. కుర్తాను కాళ్ల కిందకు జరిపే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జరగరాని డ్యామేజ్ జరిగిపోయింది. కొద్ది సెకన్ల పాటు ప్యాంట్ లేకుండా కనిపించిన వీడియో క్యాప్చర్ అయింది. జనాల కంట పడిపోయింది. అదే వీడియో సోషల్ మీడియాలో వైడ్‌గా సర్క్యులేట్ అవుతోంది. సెప్టెంబర్ 12న ఈ ఘటన జరగ్గా.. విపక్షాలు, విమర్శకులు ఎగతాళి చేసేందుకు వాడేస్తున్నారు. ఈ కొందరు ఇలాంటి సిగ్గులేని, అసభ్యకరమైన ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇజ్జత్ పోయిందిపో.. వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రొఫెషనలిజమ్ అంటూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.

Next Story