సిలిండర్ ఇవ్వండి.. నెలరోజులు ఉచితంగా బిర్యానీ తినండి!

by velandi.Saikiran |

సిలిండర్ ఇస్తే, నెల రోజుల పాటు ఫ్రీగా బిర్యాని పెడతానంటూ హోటల్ ఓనర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు.

సిలిండర్ ఇవ్వండి.. నెలరోజులు ఉచితంగా బిర్యానీ తినండి!
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా LPG కొరత ఉన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడిప్పుడే ఈ కొరతను అధిగమించే ప్రయత్నం చేస్తోంది ఇండియా. అయితే ఈ నేపథ్యంలో సిలిండర్ ఇస్తే, నెల రోజుల పాటు ఫ్రీగా బిర్యాని పెడతానంటూ హోటల్ ఓనర్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. తమిళనాడు రాష్ట్రంలోని హోసూరుకు చెందిన ఓ హోటల్ ఓనర్ ఈ ఆఫర్ పెట్టి, వైరల్ గా మారారు.

కమర్షియల్ సిలిండర్ల కొరత హోటల్స్‌ మూసివేసే పరిస్థితిని తీసుకువచ్చాయి. ఈ తరుణంలో హోట‌ల్ యజమాని అశోక్ ఈ ఆఫర్ ప్రకటించారు. దీంతో ఫ్రీ బిర్యానీ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫుల్ సిలిండర్ తీసుకొని.. వెంటనే దానికైనా డబ్బులు, ఖాళీ సిలిండర్ ఇచ్చేస్తామని కూడా అశోక్ వెల్లడించారు. దీంతో గత 15 రోజులలో మొత్తం ఆరు సిలిండర్లు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ సిలిండర్ ఇచ్చిన వారిలో ఎవరు కూడా రెండు నుంచి మూడు రోజులకు మించి ఫ్రీగా బిర్యానీ తినలేదని సమాచారం.

Next Story