అర్థ రాత్రి ట్యాంక్ బండ్‌పై రచ్చ రచ్చ.. బర్త్ డేనా.. బరితెగింపా..?

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-23 05:15:36  IST  )

ట్యాంక్ బండ్‌కు వచ్చే జనాలు కాసేపు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఫ్యామిలీతో కలిసి వచ్చి కాస్త ఎంజాయ్ చేసి వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా పిల్లలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువే. ఈ కారణంగానే ఇంతకు ముందు బర్త్ డే పేరుతో

అర్థ రాత్రి ట్యాంక్ బండ్‌పై రచ్చ రచ్చ.. బర్త్ డేనా.. బరితెగింపా..?
X

దిశ, వెబ్‌సైట్ : ట్యాంక్ బండ్‌కు వచ్చే జనాలు కాసేపు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఫ్యామిలీతో కలిసి వచ్చి కాస్త ఎంజాయ్ చేసి వెళ్లాలని అనుకుంటారు. ముఖ్యంగా పిల్లలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువే. ఈ కారణంగానే ఇంతకు ముందు బర్త్ డే పేరుతో చేసే రచ్చతో జనాలు ఇబ్బందులు పడుతున్నారని.. అక్కడ ఇలాంటివి బ్యాన్ చేశారు. కేక్ కటింగ్‌కు కూడా అనుమతి లేదని పోలీసులు నిషేధించారు. కానీ ఆ తంతు ఇంకా కొనసాగుతోంది. తాజాగా కొందరు కుర్రాళ్లు బర్త్ డే అంటూ రచ్చ రచ్చ చేశారు. బర్త్ డే బాయ్‌కు బొట్టు పెట్టి.. శాలువా కప్పి.. ఆ తర్వాత క్రాకర్స్ పేల్చి వీరంగం సృష్టించారు. అక్కడున్న వారికి మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను కూడా ఇబ్బందులకు గురి చేశారు.

ఇదంతా అనుమతి లేకుండానే జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మందికి అవగాహన లేదని.. పోలీసులే చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ట్యాంక్ బండ్ కాస్త కేక్ బండ్‌లా మారిపోయిందని.. స్పెషల్ డ్రైవ్ చేపట్టి జరిమానాలు విధించాలని ఇంకొందరు సూచిస్తున్నారు.

VIDEO

Next Story