- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. అర్ధరాత్రి రోడ్లపై హంగామా! వైరల్
పోలీసుల ముందే బైక్ స్టంట్స్ చేస్తూ అర్ధరాత్రి రోడ్లపై ఇద్దరు యువకులు హంగామా సృష్టించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసుల ముందే బైక్ స్టంట్స్ చేస్తూ అర్ధరాత్రి రోడ్లపై ఇద్దరు యువకులు హంగామా సృష్టించారు. కర్ణాటకలోని మైసూరులో ఇద్దరు యువకులు చేసిన ప్రమాదకర విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారాయి. వైరల్ వీడియో ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో స్కూటీపై ‘వీలింగ్’ చేస్తూ రోడ్డుపై దూసుకెళ్లిన యువకులు, గస్తీ తిరుగుతున్న పోలీస్ కారును లెక్కచేయకుండా దాటేశారు. అంతే కాదు.. బైక్‌పై వెళ్తున్న పోలీసులను కూడా అదే స్టైల్‌లో ఓవర్‌టేక్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ మొత్తం ఘటనను మరో బైక్ రైడర్ వీడియో తీస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల ముందే ఈ స్థాయిలో స్టంట్స్ చేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఇది స్టంట్ కాదు.. ప్రాణాలతో చెలగాటం...
ఈ ప్రమాదకర స్టంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన చాలామంది ‘ఇది స్టంట్ కాదు.. ప్రాణాలతో చెలగాటం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టం అంటే భయం లేకుండా పోయిందని నెటిజన్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను గుర్తించే పనిలో పోలీసులు పడినట్లు తెలుస్తోంది. వీడియో ఇదే..






