- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో.. చేతికి పాము చుట్టుకుని బైక్ రైడింగ్.. వీడియో వైరల్
చాలా మందికి పాములు అంటే భయం ఉంటుంది. పామును దూరంగా చూసినా పారిపోతారు. అక్కడ పాము ఉంది అంటే ఆ వైపు కూడా వెళ్లరు.

దిశ, వెబ్ డెస్క్: చాలా మందికి పాములు అంటే భయం ఉంటుంది. పామును దూరంగా చూసినా పారిపోతారు. అక్కడ పాము ఉంది అంటే ఆ వైపు కూడా వెళ్లరు. కానీ ఓ వ్యక్తి ఏకంగా పామునే తన చేతికి చుట్టుకున్నాడు. అంతే కాకుండా అలా చేతికి పామును చుట్టుకుని మరో చేతితో బైక్ నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో పాము పూర్తిగా అతడి చేతిని మణికట్టు వద్ద చుట్టుకోగా దాని తల మాత్రం బైకర్ చేతిలో కనిపిస్తుంది. ఓ వైపు పామును చేతికి చుట్టుకున్నప్పటికీ ఆ వ్యక్తి మెల్లగా వెళ్లకుండా బైక్‌ను వేగంగా నడిపిస్తూ అటూ ఇటూ తిప్పుకుంటూ వెళుతున్నాడు.
ఇక బైక్ నంబర్ చూస్తే ఆ యువకుడు మధ్య ప్రదేశ్‌కు చెందిన వాడుగా తెలుస్తోంది. అయితే నిజానికి అతడు ఒంటరిగా ఉన్నప్పుడు పామును పట్టుకున్నా, దానితో డ్యాన్స్ చేసినా ఇతరులకు ఇబ్బంది ఉండదు. కానీ అతడు దానిని ఏకంగా రోడ్డుపైనే పట్టుకుని తిరిగితే పక్కన వెళ్లే వాళ్లు ఎవరైనా చూసి భయపడితే రోడ్డు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అది చేతి నుండి తప్పించుకుని వెళ్లి ఎవరినైనా కుట్టినా ప్రమాదమే. కాబట్టి అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ వీడియోకు 3 లక్షలకు పైగా లైకులు రాగా మిలియన్స్ కొద్దీ వ్యూవ్స్ వచ్చాయి.






