- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెల్లారితే కౌంటింగ్.. గుట్టుచప్పుడు కాకుండా బ్యాలెట్ బాక్స్‌లు తరలింపు (వీడియో)
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రేపే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఓ ట్రక్కులో ఈవీఎంలు తరలించేందుకు ప్రయత్నించినట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రేపే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో ఓ ట్రక్కులో ఈవీఎంలు తరలించేందుకు ప్రయత్నించినట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీహర్‌కు సంబంధించిన ఈ వీడియోను ఆర్జేడీ, కాంగ్రెస్ శ్రేణులు షేర్ చేస్తూ ఎన్డీఏ రిగ్గింగ్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలో EVM స్టోరేజీ కంటైనర్లలా కనిపించే బాక్సులతో నిండిన ట్రక్ పార్క్ చేయబడగా.. దాని చుట్టూ ప్రజలు చేరారు. యూనిఫామ్‌లలో పోలీసులు, భద్రతా సైనికులు ఉండగా.. దాన్ని తెరిచేందుకు ట్రై చేస్తున్నారు యూత్.
అయితే తెరిచిన బ్యాలెట్ బాక్సులు పూర్తిగా ఖాళీగా ఉన్నా.. ఆర్జేడీ శ్రేణులు మాత్రం తమను ఓడించేందుకు మోడీ కుట్రలు పన్నుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇలాంటి రిగ్గింగ్ చేయడం వల్లనే ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నాయని ఫైర్ అవుతున్నారు. కాగా నవంబర్ 12న ససారామ్ కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్‌లోకి ట్రక్ ఎంటర్ అయిందని.. అది కూడా రాత్రి మూడు గంటల సమయంలో ప్రవేశించిందని.. ఆ టైమ్‌లో ఎందుకని ఆరోపిస్తున్నారు. ఎందుకు అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్‌స్టాల్ చేయలేదని.. ఇదంతా ప్రీప్లాన్డ్‌గానే ఉందని ఫైర్ అవుతున్నారు. అయితే అధికారులు బాక్సులు ఖాళీగా ఉన్నాయని.. ఎటువంటి రిగ్గింగ్ జరగలేదని వివరించినా పట్టించుకోకుండా వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్‌తో సమానంగా చూపించుకునేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపస్తున్నారు. ఇక దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఇదంతా అవాస్తవమనిజ.. తప్పదారి పట్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.






