- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ ఐడియాకి బిగ్ సెల్యూట్ అన్న.. ఏకంగా ఆటోలోనే మంచినీళ్ల ఫిల్టర్ పెట్టేశాడు!
ఎండలు మండుతున్నాయి. వివిధ పనులపై బయటకి వచ్చిన ప్రజలు వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఎండలు మండుతున్నాయి. వివిధ పనులపై బయటకి వచ్చిన ప్రజలు వేసవి తాపానికి అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు కాస్తాయినా ఉపశమనం కల్పించాలని ఓ ఆటో డ్రైవర్‌ను వినూత్నంగా ఆలోచించాడు. అందుకోసం తాను నడిపే ఆటోలో ప్రత్యేకంగా ఓ డ్రింకింగ్ వాటర్ సెక్షన్ ఏర్పాటు చేసి, ఉచితంగా తాగునీటిని అందిస్తున్నాడు. కేవలం తన కస్టమర్లకే కాదు.. రోడ్డు మీద నడుస్తున్న వారికి కూడా ఉచితంగా తాగు నీరు అందిస్తూ అందరిలో హీరో అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఆటోవాలాకు సంబంధించిన ఓ వీడియో (Video) తెగ చక్కెర్లు కొడుతోంది.
హైదరాబాద్‌కు చెందిన ఆటోవాలా (Autowala) మహ్మద్ హబీబ్ గతంలో తన స్నేహితులను కలిసేందుకు ఓ టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్లాడట. అక్కడ క్షణాల్లో నీరు అయిపోవటం గమనించిన హబీబ్ తన ఆటో కూడా రెండు తాగు నీరు డబ్బాలను పెట్టుకుని అడిగిన వారికి ఉచితంగా (Free drinking water) అందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన మిత్రుడి సాయంతో ఆటోకే ఓ సెటప్ ఏర్పాటు చేసి, కూర్చునేందుకు వసతి, ఎండ తగలకుండా ప్రత్యేక రూఫ్ సిస్టమ్, తాగడానికి డ్రింకింగ్ వాటర్ వసతి కల్పించారు. కేవలం తన ప్రయాణికులకే కాదు, రోడ్డుపై వెళ్లే వారు, ట్రాఫిక్ పోలీసులు సైతం తన సేవలను వినియోగించుకుంటున్నారు. ఇక ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవ్వటంతో హబీబ్‌ను నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. తన ఐడియాకు బిగ్ సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.






