వివాహిత మహిళతో కారులో శృంగారం.. అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త..

by Sujitha Rachapalli |

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. టిక్రాపార ప్రాంతంలో ఓ మహిళతో కారులో శృంగారం చేస్తూ దొరికిపోయాడు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకర్త భాస్కరాచార్య. మధ్యప్రదేశ్ రీవా జిల్లా నుంచి వచ్చిన ఆయన..

వివాహిత మహిళతో కారులో శృంగారం.. అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త..
X

దిశ, వెబ్ డెస్క్ : ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. టిక్రాపార ప్రాంతంలో ఓ మహిళతో కారులో శృంగారం చేస్తూ దొరికిపోయాడు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకర్త భాస్కరాచార్య. మధ్యప్రదేశ్ రీవా జిల్లా నుంచి వచ్చిన ఆయన.. వివాహిత మహిళ రీనా గుప్తాతో కారులో సన్నిహితంగా ఉండగా.. ఆమె భర్త అనిల్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. స్థానికులతో కలిసి ప్రవచనకర్తపై దాడి చేశాడు. జుట్టు కత్తిరించాడు. ఈ క్రమంలో అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన మహిళను.. అతనితోనే వెళ్లమని సూచించాడు భర్త. పద్దెనిమిదేళ్ల బంధానికి విలువ లేదని బాధపడిపోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సద్దుమణిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా భాస్కరాచార్య ఇమేజ్‌ గురించి ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వివాదంలో చిక్కుకోవడంపై ఆశ్చర్యపోతున్నారు.




Next Story