VIDEO: అబ్బ కమలాసన్.. అన్నీ బాగున్నా బిక్షగాడి నటవిశ్వరూపం

by Ajay Maddhiboyina |

ఓ వ్య‌క్తి వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. చూడ్డానికి పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తి రోడ్డుపైకి వ‌చ్చి ఒక గుడ్డ‌ను వేసి దానిపై ప‌డుకుంటాడు.

VIDEO: అబ్బ కమలాసన్.. అన్నీ బాగున్నా బిక్షగాడి నటవిశ్వరూపం
X

దిశ, వెబ్ డెస్క్: అంగ‌వైక‌ల్యం ఉండి ఎలాంటి ప‌నిచేయ‌లేనివాళ్లు కొంత‌మంది భిక్షం ఎత్తుతూ ఉంటారు. పూట గ‌డ‌వ‌టం కోసం రోడ్డుపై కూర్చుని అడుక్కుంటారు. అయితే కొంద‌రు అన్ని అవ‌య‌వాలు బాగున్నా ప‌నిచేయ‌డం చేత‌కాక‌ వైక‌ల్యం ఉన్న‌ట్టు న‌టిస్తూ అడుక్కుంటారు. అలాంటి ఓ వ్య‌క్తి వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. చూడ్డానికి పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్య‌క్తి రోడ్డుపైకి వ‌చ్చి ఒక గుడ్డ‌ను వేసి దానిపై ప‌డుకుంటాడు. అయితే అప్ప‌టి వ‌ర‌కు చూడ్డానికి బాగుండ‌గా ప‌డుకునేట‌ప్పుడు కాళ్లు, చేతులు వంక‌ర పోయిన‌ట్టుగా న‌టిస్తూ ప‌డుకున్నాడు.

చూస్తేనే జాలి ప‌డేలా క‌నిపించ‌డంతో అలా ప‌డుకున్న నిమిషాల్లోనే ఓ పెద్దాయ‌న వ‌చ్చి అత‌డికి డ‌బ్బులు కూడా ఇచ్చాడు. అయితే దీనిని ఓ వ్య‌క్తి గ‌మ‌నించ‌గా సెల్ ఫోన్ లో వీడియో రికార్డ్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు అత‌డి న‌ట‌న చూసి షాక్ అవుతున్నారు. అబ్బా క‌మ‌లాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి వాళ్ల వ‌ల్ల అస‌లైన వైకల్యం ఉన్న‌వాళ్ల‌ను కూడా న‌మ్మ‌లేకుండా ఉంద‌ని కాబ‌ట్టి ఇలాంటి వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story