- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జమ్మూ కశ్మీర్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. 10 మంది మృతి
జమ్మూకశ్మీర్ లో భారీవర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరపి లేకుండా.. ఆకాశానికి చిల్లుపడినట్లు కురిసిన కుంభవృష్టికి మెరుపు వరదలు సంభవించాయి.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్ లో భారీవర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరపి లేకుండా.. ఆకాశానికి చిల్లుపడినట్లు కురిసిన కుంభవృష్టికి మెరుపు వరదలు సంభవించాయి. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో వరదల కారణంగా సుమారు 10 మంది వరకూ మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. రాజౌరీలో నదులు పొంగిపొర్లడంతో కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. స్థానిక బస్టాండ్ నీటమునగగా.. వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తోహ్, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండగా.. ఆ ప్రవాహం ధాటికి దార్హాలి నది సేఫ్టీ వాల్ ధ్వంసమైంది. అబ్దుల్లా బ్రిడ్జి సమీపంలోని 50కి పైగా కుటుంబాలను అధికారులు సేఫ్ ప్లేసులకు తరలించారు. కొన్నిప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నవారిని 14 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. పూంచ్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా.. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా.. జులై 23వ తేదీ వరకూ జమ్మూకశ్మీర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.






