- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపతో హూలా హుప్ ఆడిన ఎలుగుబంటి.. ఎంత క్యూట్‌గా ఉందో (వీడియో)
చిన్న పాపతో కలిసి ఎలుగుబంటి హులా హూప్ ఆడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: హులా హూప్.. సరదాగా ఆడే ఆట. అలాగే శరీరానికి మంచి వ్యాయామం కూడా. గుండ్రంగా ఉండే పెద్ద రింగ్ ను నడుము చుట్టూ బ్యాలెన్స్ చేస్తూ తిప్పడాన్నే హులా హూప్ గేమ్ గా పిలుస్తాం. దీనిని ఎక్కువగా పిల్లలు ఆడుతుంటారు. 1950ల కాలంలో అమెరికాలో ప్రాచుర్యం పొందిన ఈ గేమ్.. క్రమంగా మన దేశానికీ వచ్చింది. హులా అంటే హవాయి నృత్యం నుంచి వచ్చిన పేరు.
నడుము, గొంతు, కాళ్ల చుట్టూ తిప్పుతూ హూప్ నేలపై పడకుండా ఆపాలి. ఈ గేమ్ వల్ల శరీరంలో కేలరీలు బర్న్ అవుతాయి. అలాగే కండరాలు బలోపేతమై, శరీర సమతుల్యత కూడా మెరుగవుతుంది. కాగా.. తాజాగా నెట్టింట ఒక హులా హూప్ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక చిన్న పాప హులా హూప్ ను తన నడుము చుట్టూ తిప్పుతూ బ్యాలెన్స్ చేస్తుండగా.. పక్కనే ఉన్న ఎలుగుబంటి కూడా ఆ హూప్ ను తిప్పుతూ బ్యాలెన్స్ చేస్తోంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆ ఎలుగుబంటి హూప్ ను తన మెడ చుట్టూ తిప్పుతూ బ్యాలెన్స్ చేస్తోంది. ఈ వీడియో చూడ్డానికి చాలా ఫన్నీగా ఉందని, ఇలాంటి ఫ్రెండ్లీ ఎలుగుబంట్లు రష్యాలోనే ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ క్యూట్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.






