- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: పిల్ల ఎలుగుబంటికి యాక్సిడెంట్..తల్లి చేసిన పని చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తల్లిప్రేమ ఎంత మధురంగా ఉంటుందో ప్రతేకంగా చెప్పాల్సినవసరం లేదు. బిడ్డలు సంతోషంగా ఉంటే తల్లి ఎంత సతోషపడుతుందో.. బిడ్డలు కష్టపడితే తల్లి అంతే బాధపడుతుంది.

దిశ, వెబ్ డెస్క్: తల్లిప్రేమ ఎంత మధురంగా ఉంటుందో ప్రతేకంగా చెప్పాల్సినవసరం లేదు. బిడ్డలు సంతోషంగా ఉంటే తల్లి ఎంత సతోషపడుతుందో.. బిడ్డలు కష్టపడితే తల్లి అంతే బాధపడుతుంది. తన కళ్ల ముందు బిడ్డలు బాధపడుతుంటే తల్లడిల్లిపోతుంది. అయితే కేవలం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో అయినా తల్లి ప్రేమలో మార్పు ఉండదు. అందుకు నిదర్శనంగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ లోని షాదోల్ జిల్లాలో జైత్ పూర్-గోపరు రూట్లో గురువారం రాత్రి ఎలుగుబంటి పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
కాగా ప్రమాదంలో ఎలుగుబంటి పిల్లల్లోని ఒకటి తీవ్రంగా గాయపడి కదల్లేని స్థితిలో రోడ్డుపైనే ఉండిపోయింది. దీంతో తన బిడ్డను కాపాడేందుకు తల్లిఎలుగుబంటి ఎంతో తల్లిడిల్లిపోయింది. తన బిడ్డను తీసుకెళ్లేందుకు ఎంతో ప్రయత్నించింది. అప్పటికే మరో బిడ్డ తన వీపుపై పట్టుకుని కూర్చోగా..గాయపడిన బిడ్డను పక్కకు తీసుకెళ్లడానికి శతవిధాలా ప్రయత్నించింది. దాదాపు ఒక గంటసేపు ఎలుగుబంటి తన బిడ్డకోసం కదలకుండా అక్కడే ఉండి బాధపడుతూ కనిపించింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవ్వగా వాహనదారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అధికారులు ఎలుగుబంటిని, దాని పిల్లలను సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. నెట్టింట ఈ వీడియో వైరల్ అవ్వగా జంతువులకు సైతం మనుషుల మాదిరిగానే ఎంతో ఎమోషన్ ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. video






