- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Barrelakka : కన్నీళ్లు పెట్టుకున్న బర్రెలక్క.. కారణం అదేనా?
తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు నిరుద్యోగులకు గులాబీ పార్టీ ఎలాగూ ఉద్యోగాలు ఇవ్వదని ఫిక్స్ అయ్యి తాను బర్రెలు కాస్తున్నానని వీడియో చేయడంతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల్లో బర్రెలక్కగా విపరీతంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అక్కడితో ఆగకుండా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి(Independent Candidate)గా పోటీకి దిగి మరో సంచలనం రేపి.. రాజకీయాలు ఏ ఒక్కరి సొత్తు కాదు అని నిరూపించింది. ఆ ఎనికల్లో ఓడిపోయినప్పటికీ.. ఇటు తెలంగాణ, అటు ఏపీలోనే కాకుండా బోలెడు మంది NRI ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఎన్నికల అనంతరం తన స్నేహితుడిని పెళ్లి చేసుకున్న బర్రెలక్క ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. కాని తాజాగా ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటూ చేసిన ఓ వీడియో మరోసారి సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. తాను ఏ తప్పు చేయకపోయినా తనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్(Trolling) చేస్తున్నారని కన్నీటి పర్యంతం అయింది.
ఎన్నికలు ముగిసిన వెంటనే తాను పెళ్లి చేసుకోవడాన్ని తప్పు పడుతూ తనను టార్గెట్ చేశారని.. అప్పటికే తనపై అనేక నిందలు మోపడం వలన త్వరగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఏడాది ఆగి పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. ట్రోలర్స్ కు భయపడి చేసుకున్నానని.. అయినప్పటికీ తనను ఇంకా ట్రోల్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది. పెళ్లి అయి ఏడాది గడచినా ట్రోలింగ్ వల్ల తనకు సంతోషం అనేదే లేకుండా పోయిందని.. ట్రోలర్స్ ను నేను వదిలినా దేవుడు వదలడు అంటూ శాపనార్థాలు పెడుతూ వెక్కి వెక్కి ఏడ్చింది మన బర్రెలక్క అలియాస్ శిరీష. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. అనేకమంది ఆమెకు సపోర్ట్ చేస్తుండగా.. మరికొంతమంది మాత్రం ఎప్పటిలాగే మళ్ళీ ట్రోలింగ్ కు దిగారు.






