నన్ను చేసుకునే వాడికే లేని ఇంట్రెస్ట్ మీకేందుకు? దయచేసి బ్యాడ్ కామెంట్లు చేయకండి: బర్రెలక్క

by Disha Web Desk 9 |
నన్ను చేసుకునే వాడికే లేని ఇంట్రెస్ట్ మీకేందుకు? దయచేసి బ్యాడ్ కామెంట్లు చేయకండి: బర్రెలక్క
X

దిశ, ఫీచర్స్: గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బర్రెలక్క సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బర్రెలక్క రేపు (గురువారం) ఓ ఇంటి మనిషి అవ్వబోతుంది. వెంకటేష్ అనే అబ్బాయిని వివాహం చేసుకుంటుంది. ఆల్రెడీ నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా బర్రెలక్క తన ఇన్‌స్టా్గ్రామ్ లో హల్దీ వేడుకలకు సంబంధించిన వీడియోలు కూడా తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. అయితే బర్రెలక్కకు ఇప్పటికే ఓ పెళ్లైందని సోషల్ మీడియాలో జనాలు దారుణంగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.

రీసెంట్ గా శిరీష ఈ ఇష్యూపై స్పందించి.. ‘‘నా గతం గురించి ఇంకా మట్లాడకండి. నా గతం గురించి ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు. అదంతా తలచుకుని నేను ఇంకా బాధపడలనుకోవట్లేదు. ఆ విషయం గురించి ఇంకా మాట్లాడకండి. కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నా. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకు అన్నా బ్యాడ్ కామెంట్స్ పెడితే ఏం వస్తుంది. నన్ను చేసుకోబోయే అబ్బాయికి, వాళ్ల ఫ్యామిలీకి లేని ఇంట్రెస్ట్ మీకేందుకు? కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నా. దీని గురించి మాట్లాడండి. దీని గురించి ఏమైనా సలహాలు ఇవ్వండి. ఫ్యూచర్ లో ఎలా ఉండాలో చెప్పండి’’. అంటూ బర్రెలక్క చెప్పుకొచ్చింది. అలాగే అమ్మవారి ఇంట్లో ఉన్నట్లు అత్తవారింట్లో ఉండలేము. అరవలేం, ఎవరిని ఏం అనలేం, నిజంగా అమ్మ గ్రేట్ అబ్బా. నేను అయితే ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నా. కానీ కొంచెం భయమేస్తుంది. లైఫ్ ఎలా ఉంటుందో. అంటూ శిరీష వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story