- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిషికేశ్‌లో బంగి జంపింగ్ చేస్తుండగా ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్
రిషికేశ్‌లో బంగి జంపింగ్ చేస్తుండగా సోను కుమార్ అనే వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్నేహితులతో కలిసి రిషికేశ్‌కు వచ్చిన సోను బంగి జంపింగ్ చేస్తుండగా తాడు తెగిపోయింది. దీంతో అతడు కిందపడిపోయాడు. ఓ రేకుల షెడ్ పై సోను పడిపోగా ఛాతీ,ఎడమచేతి భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: రిషికేశ్‌లో బంగి జంపింగ్ చేస్తుండగా సోను కుమార్ అనే వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. స్నేహితులతో కలిసి రిషికేశ్‌కు వచ్చిన సోను బంగి జంపింగ్ చేస్తుండగా తాడు తెగిపోయింది. దీంతో అతడు కిందపడిపోయాడు. ఓ రేకుల షెడ్ పై సోను పడిపోగా ఛాతీ,ఎడమచేతి భాగంలో తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే తెహ్రీ గర్హాల్ డీఎం నికితా ఖండేల్వాల్ పూర్తి విచారణకు ఆదేశించారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రమాదం జరిగిన స్థలంలో అన్ని కార్యకలాపాలను నిలిపివేశారు.
సాహస క్రీడలను నిర్వహించే కంపెలు ముందు జాగ్రత్తలు ఖచ్చితంగా నిర్వహిచాలని కోరారు. కాగా సోనూ కుమార్ బంగి జంపింగ్ చేస్తుండగా రికార్డ్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సోనును తాడుతో కిందకు దింపే క్రమంలోనే అది తెగిపోయి చాలా ఎత్తునుండి పడిపోయాడు. మరోవైపు ఈ ప్రమాదానికి హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వీడియో వైరల్ అవ్వడంతో ఇండియాలో సరైన భద్రత ఉండదు అని, అధికారులు పట్టించుకోరు కాబట్టి సాహస క్రీడలను దేశంలోనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. video






