- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎండలు ముదురుతుండటంతో మద్యం ప్రియులు బీరు తాగేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలోనే నగర పరిధిలో ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో బీర్ బాటిల్‌లో ఏకంగా ‘చేప పిల్ల’ ప్రత్యక్షమవ్వడం స్థానికంగా కలకలం రేపింది.
మల్లాపూర్ సమీపంలోని ఓ వైన్ షాపులో ఒక కస్టమర్ కింగ్‌ఫిషర్ (Kingfisher) బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. బాటిల్ సీల్ తీయబోయే ముందు అనుమానం వచ్చి లోపల చూడగా.. అందులో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. తీరా నిశితంగా పరిశీలిస్తే, అందులో ఒక చిన్న చేప పిల్ల ఉండటాన్ని చూసి సదరు మందుబాబు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అనంతరం ఆ బీరు బాటిల్‌ను షాపు నిర్వాహకులకు చూపించగా వారు కూడా ఆశ్చర్యపోయారు.
బాటిల్ సీల్ చేసి ఉన్నప్పటికీ లోపలికి చేప పిల్ల ఎలా వచ్చిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. తయారీ కేంద్రం (Brewery) వద్ద బాటిళ్లను శుభ్రం చేసే ప్రక్రియలో కానీ, బీర్ నింపే సమయంలో కానీ తప్పిదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీరు బాటిల్‌లో చేప ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు.. ‘బీర్ తాగే ముందు బాటిల్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






