- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video : అరేయ్ బాబూ అది ఆటోనా? బస్ ఆ..? అంటున్న నెటిజన్స్
పోలీసులు ఓ చెక్ పాయింట్ వద్ద సాధారణ తనిఖీలు చేస్తూ ఒక ఆటోను ఆపారు.

దిశ, వెబ్ డెస్క్ : పోలీసులు ఓ చెక్ పాయింట్ వద్ద సాధారణ తనిఖీలు చేస్తూ ఒక ఆటోను ఆపారు. దానిలో నుంచి బయటికి వచ్చిన ప్యాసింజర్లను చూసి అవాక్కయ్యారు. ఆ ఆటో నుంచి ఏకంగా 19 మంది ప్రయాణికులు కిందికి దిగడం చూసి షాక్ అయ్యారు. ఆరేయ్ బాబూ.. అది ఆటో అనుకున్నవా.. బస్ అనుకున్నవా అంటూ సదరు ఆటో డ్రైవర్ మీద భారీగా చలాన్ విధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 15న బారుసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహదారిపై వెళ్తున్న ఒక ఆటోను పోలీసులు చూశారు. అందులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటాన్ని గమనించి, చెక్‌పాయింట్ వద్ద ఆ ఆటోను ఆపారు. అందులో ప్రయాణించిన వారిని కిందకు దిగమని చెప్పగా.. ఏకంగా 19 మంది ప్రయాణికులు ఆటో దిగడంతో పోలీసులు షాక్ అయ్యారు.
నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకుని, వారి ప్రాణాలను రిస్క్‌లో పడేసిన ఆ ఆటో డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు ఒక్కొక్కరుగా 19 మంది ప్రయాణికులు ఆ ఆటో నుంచి కిందికి దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. అది ఆటో అనుకున్నావా బస్ అనుకున్నావా బాబూ అని ఒకరంటే.. అది ప్యాసింజర్ రైలు బోగీలా ఉందని ఇంకొకరు కామెంట్ చేశారు.






