- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రితో గొడవ.. కూతురిపై ఇనుపరాడ్డుతో ఆటోడ్రైవర్ ప్రతీకారం (వీడియో)
తండ్రితో జరిగిన గొడవతో పగ పెంచుకున్న ఓ ఆటోడ్రైవర్ ఆ కోపాన్ని చిన్నపాపపై చూపించాడు. ఆ పాపను అదనుచూసి పట్టుకుని ఇనుపరాడ్డుతో దారుణానికి ఒడిగట్టాడు.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. పగ ప్రతీకారాలు పసిపిల్లల ప్రాణాల మీదకు వస్తాయని ఈ ఉదంతం నిరూపించింది. కేవలం తండ్రితో వచ్చిన గొడవను మనసులో పెట్టుకున్న ఓ కిరాతకుడు, ఆ కోపాన్ని ఏ పాపమూ ఎరుగని నాలుగేళ్ల చిన్నారిపై చూపించాడు.
గొడవ తండ్రితో.. పగ కూతురిపై!
స్థానిక సమాచారం ప్రకారం.. ఓ ఆటో డ్రైవర్‌కు, సదరు పాప తండ్రికి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అది కాస్తా ముదిరి ఒకరిపై ఒకరు అరుచుకునే వరకు వెళ్లింది. అయితే.. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆటో డ్రైవర్, మనసులో మాత్రం కక్ష పెంచుకున్నాడు. తండ్రిపై నేరుగా దాడి చేయలేక, తన క్రూరత్వాన్ని పసిపాపపై ప్రదర్శించాడు. అదను చూసి ఆ చిన్నారిని పట్టుకున్న నిందితుడు, కనికరం లేకుండా పాపను నేలకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో తలపై బలంగా బాదాడు. రక్తపు మడుగులో పడి ఉన్న పాపను చూసి స్థానికులు హతాశులయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చిన్నారి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.
కటకటాల్లోకి కిరాతకుడు
ఈ అమానుష ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్షణాల్లో స్పందించారు. పరారీలో ఉన్న నిందితుడిని గాలించి మరీ అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పసిపిల్లలపై ఇలాంటి దాడులు జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.






