Viral Video : అమరావతి.. ఆటో డ్రైవర్.. ఆంగ్లం.. వావ్ అంటున్న నెటిజన్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-02-16 10:36:18  IST  )

ప్రస్తుత రోజుల్లో ఇంగ్లీష్(English) అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అయిపోయింది.

Viral Video : అమరావతి.. ఆటో డ్రైవర్.. ఆంగ్లం.. వావ్ అంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత రోజుల్లో ఇంగ్లీష్(English) అనేది యూనివర్సల్ లాంగ్వేజ్ అయిపోయింది. ఇంగ్లీష్ ఒక్కటి గడగడా మాట్లాడటం వస్తే చాలు ప్రపంచంలో ఎక్కడైనా బతికేయవచ్చు. మనదేశంలో మాత్రం చాలామంది ఇంగ్లీష్ ను ఒక లాంగ్వేజ్ గానే చూస్తారు గాని.. కమ్యూనికేషన్ స్కిల్స్(Comminication Skills) ఎంత అవసరమో తెలుసుకోని వారు కోకొల్లలు. ఇక అనేక రాష్ట్రాల్లో వారి విద్యాభ్యాసం అంతా వారి స్థానిక భాషలలో కొనసాగడం కూడా ఒక కారణమే. అయితే ఇలాంటి వాటిని పక్కకు నెట్టిస్తూ కొనతమంది మాత్రం వారి ఇంగ్షీషుతో మనల్ని మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. టూరిస్టులు ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో సాధారణంగా అక్కడ పని చేసేవారు, హోటల్స్ నిర్వహకులు, స్ట్రీట్ వెండర్స్ టూరిస్టులకు అనుగుణంగా ఇంగ్షీషు నేర్చుకొని అలవొకగా నేర్చుకొని మాట్లాడతారు.

అలాంటి వారిలో ఈ ఆటోడ్రైవర్ ఒకరు. మహారాష్ట్రలోని అమరావతిలో ఓ ఆటోడ్రైవర్(Amaravathi Auto Driver) కు ఓ స్థానికునికి జరిగిన ఇంగ్షీషు సంభాషణ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. పేరు తెలియని ఆ డ్రైవర్ ఇంగ్షీషు వాల్యూ గురించి చెప్తూ.. నీకు ఇంగ్షీషు వస్తే ప్రపంచంలో పారిస్, లండన్.. ఎక్కడైనా జీవిస్తావు. ఎక్కడైనా వెళ్లగలవు. ఇంగ్షీషు రాకపోతే ఎక్కడికీ వెళ్లలేవు, ఏమీ చేయలేవు అన్నాడు. దీనికి ఒక ఉదాహరణ చెబుతూ.. నువు లండన్ లోని ఒక పెద్ద హోటల్ కి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు కావాలి అని ఇంగ్షీషులో అడిగితే మర్యాదగా తెచ్చి ఇస్తాడు. అదే నువు మరాఠీలో ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమని అడిగితే.. గెట్ ఔట్ ఫస్ట్ అంటాడు.. అని చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇంగ్షీషు బాగా నేర్చుకోవాలి అని ఆ యూట్యూబర్ కి సలహా కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ తీరు ఎందరో నెటిజెన్లను ఆకట్టుకుంది. ఎంతో వేగంగా, స్పష్టంగా, గలగలా మాట్లాడుతుండటం చూసి నెటిజన్స్ వావ్ అంటున్నారు. మీరు కూడా కింద వీడియోను ఓ లుక్కేయండి మరి.

Next Story