- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Knockout beer: నాకౌట్.. ఆటో డ్రైవర్ ఔట్! పోలీసులకు పట్టించిన బీరు
ట్రాపిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్ : ట్రాపిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడపవద్దని పోలీసులు ఎంత అవగాహన కల్పించినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయవద్దని కోరుతున్న పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్(drunk and drive)లో పట్టుబడిన వాహనదారులకు వేల రూపాయల్లో ఫైన్లు విధిస్తూ కోర్టులో జైలు శిక్షలు వేయిస్తున్నారు. అయినా చాలా మంది వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. పట్టుబడిన సమయంలో నానా హంగామా చేస్తూ పోలీసుల విధులను అడ్డుకుంటున్నారు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కి ముప్పుతిప్పలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.
హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ ఆటో డ్రైవర్ చిక్కాడు. అతడిని బ్రీత్ ఎనలైజర్(Breath Analyzer)తో టెస్ట్ చేయగా 200 పాయింట్లు రీడింగ్ వచ్చింది. దీంతో షాక్ తిన్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ ఆటోడ్రైవర్ నానా హంగామా సృష్టించాడు. తాను ఒక్కటే నాకౌట్ బీరు(Knockout beer) తాగనని, ఒక్క బీరుకే 200 పాయింట్ల రీడింగ్ వస్తుందా అంటూ గగ్గోలు పెట్టాడు. తాను గరీబోన్నని, వదిలేయండి సారో అంటూ తలను ఆటో అద్దానికేసి బాదుకున్నాడు. రోడ్డంతా ఉరుకులు, పరుగులు పెట్టాడు. ఈ తతంగం అంతా వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆటో డ్రైవర్ చేస్తున్న కోతి చేష్టలు నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.
అయితే ఆటో డ్రైవర్ బాగా మద్యం తాగినట్లు తెలుస్తోంది. ఒక్క బీరుకు 200 పాయింట్ల రీడింగ్ రాదని పోలీసులు సైతం అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా కొంచెం మోతాదులో మద్యం తాగితే 40 పాయింట్ల రీడింగ్ చూపిస్తుంది, ఎక్కువగా తాగితే 120 రీడింగ్ చూపిస్తుందని చెబుతున్నారు. 200 పాయింట్లు అంటే ఫుల్‌గా తాగినట్టేనని వివరిస్తున్నారు. గతంలోనూ ఓ లారీ డ్రైవర్‌కు ఇలాగే టెస్ట్ చేయగా 398 పాయింట్లు వచ్చిందని, ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగినా లేదా ఆరు హార్డ్ బీర్లు తాగినా అంత మొత్తంలో రీడింగ్ రాదని చెప్పారు. కానీ అతను కూడా ఒక్క పెగ్గే వేశానని గొడవకు దిగినట్టు గుర్తు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపితే మీ ప్రాణాలతోపాటు ఎదుటి వారి ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టినట్టేనని, అలాంటి వారిపట్లు కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






