- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలికాలపు కాపురం.. భర్త ముందే మేనల్లుడిని పెళ్లాడిన అత్త..!
ఈ మధ్యకాలంలో ప్రేమంటే ఏంటో, బంధాలంటే ఏంటో, పెళ్లంటే ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. సినిమా కథలను మించిపోయే ట్విస్టులు, షాక్‌లు రియల్ లైఫ్‌లో కనిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో ప్రేమంటే ఏంటో, బంధాలంటే ఏంటో, పెళ్లంటే ఏంటో అస్సలు అర్థం కావడం లేదు. సినిమా కథలను మించిపోయే ట్విస్టులు, షాక్‌లు రియల్ లైఫ్‌లో కనిపిస్తున్నాయి. తాజాగా బీహార్‌లోని జముయిలో జరిగిన ఓ ఘటన చూస్తే మాత్రం, మీ కళ్లు బైర్లు కమ్మడం పక్కా..! ఏకంగా ఓ అత్త, తన సొంత భర్త కళ్లముందే, తన మేనల్లుడిని గుడిలో పెళ్లి చేసుకుంది. అవును, మీరు విన్నది నిజం..
ఈ అద్భుతమైన, విచిత్రమైన పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతోంది. వీడియోలో, ఆ మగధీరుడు తన మామ (అత్త భర్త), ఇతర కుటుంబ సభ్యుల కళ్ళ ముందే తన అత్తను మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకుంటున్నాడు. ఆహా..! ఎంతటి తెగువ..! ఎంతటి త్యాగం..!
జముయి జిల్లాలోని సిఖేరియా గ్రామంలో జరిగిన ఈ ప్రేమాయణంలో, ఆ ఘనత వహించిన అత్త పేరు ఆయుషి కుమారి. ఈమె తన మేనల్లుడిని గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇంకేం కావాలి..? ఈ అపురూపమైన వేడుకకు ఆమె స్వంత కూతురు, మొదటి భర్త విశాల్ కూడా సాక్షులుగా నిలబడ్డారట..! ఆహా, ఏమి సిచ్యుయేషన్..! ఇది శుక్రవారం (జూన్ 20) సాయంత్రం జరిగిందని వార్తలు గుప్పుమంటున్నాయి.
అసలు కథేంటంటే..
ఆయుషికి 2021లోనే అదే గ్రామానికి చెందిన విశాల్ దూబేతో పెళ్లైంది. వారికి ముద్దులొలికే మూడేళ్ల కూతురు కూడా ఉంది. కానీ, ఆయుషికి ఆ గ్రామంలోనే ఉండే తన మేనల్లుడు సచిన్ దూబేతో రహస్య సంబంధం కొనసాగుతోంది. మామూలుగానే సోషల్ మీడియాలో చాటింగ్‌లు, ఆపై ఫోన్ కాల్స్, ఆ తర్వాత నేరుగా కబుర్లు. అబ్బో, ఎంత వేగంగా పుంజుకుందో వీరి ప్రేమాయణం..! ఇంట్లో వాళ్లకు ఎవరికీ అనుమానం రాలేదట. ఎందుకంటే, ఆ మేనల్లుడు ఆమె కంటే వయసులో చాలా చిన్నవాడు కదా..! అత్తా, మేనల్లుడు మామూలుగానే కబుర్లు చెప్పుకుంటారనుకున్నారు పాపం!
ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రేమ కథకు సడెన్‌గా ట్విస్ట్ ఇచ్చారు ఈ ప్రేమజంట.. రెండు కుటుంబాలకూ తమ అక్రమ సంబంధం గురించి ధైర్యంగా చెప్పేశారు. చెప్పడమే కాదు, వాళ్ల ఒప్పందాన్ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం ఊళ్లోని గుడిలోనే సచిన్‌ని ఆయుషి పెళ్లి చేసుకున్నారు.
సచిన్ మీడియాతో మాట్లాడుతూ, "మేమిద్దరం రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు మా సంబంధానికి ఒక పేరు దొరికింది. నేను ఆయుషిని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను," అని సెలవిచ్చారు.
ఇక, ఆయుషి మొదటి భర్త విశాల్ స్పందన అయితే హైలైట్..! ఆయన మాట్లాడుతూ, "ఈ పెళ్లి వల్ల ఆమె సంతోషంగా ఉంటే, నేను ఆమెను ఆపను. కానీ ఆమె నాపై చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధం. ఆమె మా అమ్మతో, మా కూతురితో చాలా చెడుగా ప్రవర్తించేది. ఈరోజు నుంచి ఆమె బాధ్యత అంతా సచిన్‌దే," అని చేతులెత్తేశారు.
ఇది ప్రేమ కోసమా? లేక గొడవలు లేని జీవితం కోసమా? తెలీదు కానీ, జముయిలో మాత్రం ఈ ప్రేమకథ చర్చనీయాంశంగా మారింది. కలికాలంలో ఈ బంధానికి ఏ పేరు పెట్టాలో అర్థం కావడం లేదు బాబోయ్..!






