ఫ్యామిలీ ప్యాకేజీ.. ఒకేసారి గర్భం దాల్చిన అత్త, కోడలు, అమ్మ, అమ్మమ్మ (వీడియో)

by sudharani |
ఫ్యామిలీ ప్యాకేజీ.. ఒకేసారి గర్భం దాల్చిన అత్త, కోడలు, అమ్మ, అమ్మమ్మ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో పుట్టిన రోజులకు, పెళ్లిల్లకు, గర్భం దాల్చినప్పుడు ఫొటో షూట్‌ చేసుకోవడం చాలా కామన్‌గా మారాయి. డిఫరెంట్‌గా ట్రై చేస్తూ.. సోషల్ మీడియాలో కూడా నిలుస్తున్నారు. తాజాగా.. ఇలాంటి ఫొటో షూట్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇందులో విశేషం ఏంటంటే.. ఓ యువతితో పాటు.. వాళ్ల అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ కూడా గర్భంతో దర్శనమిచ్చారు. ఈ ఫొటో షూట్ చూసిన వారు మాత్రం మూడు తరాలు ఒకే సారి ఎలా గర్భం దాల్చారు.. అసలు ఇది ఎలా సాధ్యం అంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన అసలు వివారాల్లోకి వెళితే..

బిజిన్ అనే వ్యక్తి ఓ ఫొటో గ్రాఫర్. అతని భార్య గర్భం దాల్చింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. అయితే అందరిలా కాకుండా డిఫరెంట్‌గా ఫొటో షూట్ చేసుకుందాం అని ప్లాన్ చేశారు. దీంతో గర్భం దాల్చిన యువతితో పాటు తన అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మను కూడా ఈ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అంటే యువతి మాత్రమే గర్భం దాల్చింది. మిగిలిన మహిళలు ఫొటోలు కోసం దిండును గర్భంల అమర్చుకుని ఫోసులు ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఫొటో షూట్ వీడియో వైరల్ అయి.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రావడంతో ఆ ఫ్యామిలీ చాలా సంతోషించారు.

Next Story