- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్చం ఆ జంతువు ముఖం ఆకారంలో కొండ.. చూడడానికి ఎగబడుతున్న ప్రజలు(ఫొటోలు వైరల్)
ప్రకృతిలో ఎన్నో వింతలను మనం గమనిస్తూనే ఉంటాం.

దిశ,వెబ్‌డెస్క్: ప్రకృతిలో ఎన్నో వింతలను మనం గమనిస్తూనే ఉంటాం. కొండ ప్రాంతాలు, చెట్లు, విశాలమైన మైదనాలు, ప్రకృతి ఒడిలో ఎంతో విలాసవంతంగా గడుపుతున్న ఆ పక్షులు, జంతువులను చూస్తుంటే సరదాగా అనిపిస్తుంటుంది. ఓ పక్క జల సవ్వళ్ళు, మరోపక్క పక్షుల కిలకిల రాగాలు వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈ బీజీ లైఫ్‌లో కాస్త సమయం దొరికితే చాలు పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో కలిసి టూరిస్ట్ ప్రదేశాలకు వెళ్లి ఆనందంగా గడుపుతుంటారు.
అయితే ప్రకృతిలో కొండలు, చెరువులు, సేలయేరు, ఆకాశంలో మేఘాలు చూస్తే వింత వింత ఆకారంలో కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఏదైనా కొండను చూసినప్పుడు అది జంతువు లేక మనిషి ఆకారంలో కనిపించడాన్ని కూడా గమనిస్తుంటాం. అయితే ఓ కొండ అచ్చం కుక్క ముఖం ఆకారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. శునకం ముఖం ఆకారంలో కనిపించడంతో అది చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. చైనా(Chaina)లోని షాంఘైకి చెందిన గువో కింగ్‌షాన్(Guo Qingshan) తన వెకేషన్ ఫొటోను షేర్ చేయగా అందులో ప్రత్యేకమైన ఆకారంలో ఉన్న పర్వతం పై అందిరి దృష్టి పడింది. దీన్ని ‘పప్పీ మౌంటెన్’(Puppy Mountain) అని ఆమె పిలిచింది. దీంతో ఫ్రొటోగ్రాఫర్లు, టూరిస్టులు ఆ ప్రాంతానికి తరలి వస్తున్నారు.
‘‘ఇది చాలా అద్భుతంగా, అందంగా ఉంది. నేను చాలా ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉన్నప్పుడు నేను దానిని కనుగొన్నాను’’ అని గువో అసోసియేటెడ్ చెప్పారు. అయితే ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా దానిని చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు అది కుక్క పిల్లని కుతూహలంగా చూస్తున్నట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. మరికొందరు మరోసారి ఆ ఫొటోల వైపు తిరిగి చూస్తే.. ఆశ్చర్యానికి, ఆ నిర్మాణం నేలపై విశ్రమించిన కుక్కలా కనిపించింది. దాని ముక్కు దాదాపు యాంగ్జీ నదిని తాకుతున్నట్లుగా.. అది నీళ్లు తాగడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ విధంగా ఆ కొండ(పప్పీ మౌంటెన్)కు సంబంధించిన ఫొటో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






