- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెక్నలాజియా.. వేలు లేకుండానే వేలిముద్ర.. షాకింగ్ వీడియో వైరల్
టెక్నాలజీ రోజురోజుకు డెవలప్ అవుతోంది. అభివృద్ధి మంచిదే అయినా కొన్నిసార్లు అనర్థాలకు సైతం దారి తీస్తోంది. మంచితో పాటు చెడుకు సైతం టెక్నాలజీని వాడుకుంటూ నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. ఇక తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నేరగాళ్లు సులువుగా తప్పింకునేలా టెక్నాలజీ ఎలా సహాయపడగలదో చెబుతోంది.

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ రోజురోజుకు డెవలప్ అవుతోంది. అభివృద్ధి మంచిదే అయినా కొన్నిసార్లు అనర్థాలకు సైతం దారి తీస్తోంది. మంచితో పాటు చెడుకు సైతం టెక్నాలజీని వాడుకుంటూ నేరగాళ్లు తప్పించుకుంటున్నారు. ఇక తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నేరగాళ్లు సులువుగా తప్పింకునేలా టెక్నాలజీ ఎలా సహాయపడగలదో చెబుతోంది. సాధారణంగా ఏదైనా నేరం జరిగినప్పుడు నింధితుని ఆనవాళ్లను పోలీసులు వెతుకుతారు. అక్కడ నుండి కచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ సేకరిస్తారు...
ఎలాంటి ఆధారాలు దొరకని కేసుల్లో ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అయినా నేరస్థులను గుర్తిస్తారు. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఏకంగా ఆర్టిఫిషియల్ ఫింగర్స్ తయారు చేసినట్టు కనిపిస్తుంది. ఒక రబ్బర్ మాదిరిగా ఉన్న ఆ ఆర్టిఫీషియల్ ఫింగర్స్ ను వేళ్లకు తొడుక్కుంటే నిజమైన వేలు మాదిరిగానే కనిపిస్తున్నాయి. వాటిపై ఫింగర్ ప్రింట్స్ సైతం ఉండటం ఆశ్చర్యకరం. అయితే ఇలాంటివాటిని తొడుకుని నేరాలకు పాల్పడితే అసలు నిందితులు ఎవరు అని పట్టుకోవడం కూడా అంత సులభం కాదు. కాబట్టి ఇలాంటివి వస్తే చాలా ప్రమాదం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీని ఇలాంటి పనులకు ఉపయోగించకూడదు అని సూచిస్తున్నారు. వీడియో






