- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచిన్ టెండూల్కర్ కొడుకు నిశ్చితార్థం.. జోడీ అదిరిపోయింది.. (ఫుల్ డిటెయిల్స్)
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌ను ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. ఈ ఇంటిమేట్ సెరమనీలో టెండూల్కర్

దిశ, వెబ్ డెస్క్ : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌ను ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. ఈ ఇంటిమేట్ సెరమనీలో టెండూల్కర్, ఘాయ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పాల్గొనగా.. ఇందుకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 13న జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సచిన్ కూతురు సారా సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఇంతకు సానియా ఎవరు? ఏం చేస్తుంది? ఆమె వయసు ఎంత? అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేట్ చేసిన సానియా.. మిస్టర్ పాస్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్ఎల్‌పీ వ్యవస్థాపకురాలు. ముంబైలో పెట్ స్పా రన్ చేస్తున్న ఆమెకు ప్రస్తుతం 25ఏళ్లు కాగా.. అర్జున్ కూడా అదే ఏజ్. దీంతో ఈ జోడీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.






