ఇంట్లో మొబైల్ చూస్తున్నారా..? అయితే మీకు విడాకులు తప్పవు

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-05-06 12:23:43  IST  )

రోజులో ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్న భర్తకు భార్య దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

ఇంట్లో మొబైల్ చూస్తున్నారా..? అయితే మీకు విడాకులు తప్పవు
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా విస్తృతం అవడం, ఇంటర్ నెట్ అన్ లిమిటెడ్ ప్యాక్‌తో లభిస్తుండటంతో అందరి తలలు మొబైల్‌లోనే ముంచుతున్నారు. పాలు తాగే శిశువు నుంచి మంచానపడ్డ వృద్ధుల వరకు చేతిలో ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితికి చేరిపోయారు. దీంతో ఇంట్లో నలుగురు ఉన్నా.. ఒకరికొకరు నేరుగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. అంతా చాటింగ్.. వీడియో స్క్రోలింగ్‌లతోనే గడుపుతున్నారు. సమయానుకూలాంగా ఆహారం కూడా తీసుకోవడం లేదు. ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో ఆలోచింపజేయడంతోపాటు నవ్వులు పూయిస్తుంది. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్‌తోనే అందరి చెంప చెళ్లుమనిపించేలా తీసిన ఈ షార్ట్ వీడియోలో ఏముందంటే..

రోజులో ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తోనే గడుపుతున్న భర్తకు భార్య దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ‘‘ఇక నా అవసరం ఏముంది.. నువ్వు ఆ సెల్‌ఫోన్‌తోనే సంసారం చేసుకో..’’ అంటూ రుసరుసలాడటమే కాదు.. టుంగుటుయాలలో ఫోన్ చేస్తూ కూర్చున్న భర్తను ఇంట్లోని దేవుడి గుడి వద్దకు తీసుకెళ్లి మొబైల్‌కు పసుపుకొమ్ము తాళిని కట్టించింది. ఫోన్‌పై, భర్తపై అక్షింతలు చల్లి దీవించింది. అనంతరం తన బ్యాగు సర్థుకుని పిల్లాడితో పుట్టింటికి వెళ్లింది. అదే సమయంలో అక్కడే కూర్చోని ఫోన్ చేస్తున్న పెద్ద కొడుకు వైపై ఆయన భార్య చూడటంతో అతను ఫోన్‌ను పక్కకు పడేసి చేతులు కట్టుకుని కూర్చుంటాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story