- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయం కోసం భారత్ ఎదురు చూపు.. పహల్గాం ఉగ్రదాడిపై ఆసక్తికర యానిమేషన్ వీడియో వైరల్
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam terror attack) ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా అణువణువు క్షుణ్ణంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఉగ్రదాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. అయితే ఈ ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. ఉగ్రవాదులు దాడి చేసే సమయంలో కేవలం ఒక మతం వారినే టార్గెట్ చేసి కాల్చి చంపారని మృతుల కుటుంబాలు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదని మరో వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే దాడికి సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు వీడియోలు షేర్ చేస్తున్నారు. అందులో భాగంగా ఉగ్రదాడికి సంబంధించిన ఓ యానిమేషన్ (animation video) వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
నువ్వు హిందువా? అని ఆ వీడియోను మహావీర్ జైన్ అనే నెటిజన్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. వీడియోలో చూపించిన ప్రకారం.. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ వ్యాలీలో మధ్యాహ్నం అందరూ పర్యటకులు గుర్రాలపై తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తారు. ఒక్కసారిగా ఉగ్రవాదులు విరుచుకుపడతారు. నువ్వు హిందువా? అని మతం అడిగి కాల్చి చంపుతారు. అనంతరం రంగంలోకి దిగిన ఆర్మీ పర్యటకులను చేరదీస్తోంది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం అవుతారు. మృతుల కుటుంబాలకు వారు భరోసా కల్పిస్తారు. రంగంలోకి దిగిన భారత సైన్యానికి దేవుళ్ల ఆశీర్వాదం ఉంటుంది. ఈ క్రమంలోనే భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెడుతారు. న్యాయం కోసం ఎదురు చూస్తున్న భారత్.. అంటూ పహల్గాం ఉగ్రదాడి పై యానిమేషన్ రూపంలో వీడియో రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. భారత్‌లో ఉన్న టెర్రరిస్టులను అంతం చేయాలని భారత ప్రభుత్వాన్ని నెటిజన్లు కోరుతున్నారు.






