- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: అమెరికాలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా?
తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని అమెరికా నిర్విరామంగా కొనసాగిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని అమెరికా నిర్విరామంగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అమెరికా అధికారులు తీవ్ర వివాదస్పదంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పర్యాటక, ఉన్నత విద్య వీసాలపై అమెరికాకు వెళ్లి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి, డుంకీ మార్గాల్లో అక్రమంగా వచ్చిన వారికి కంటి మీద కునుకు ఉండటం లేదు. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే వీరి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. అధికారులు వీరి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుస్తోంది.
అమెరికా వ్యాప్తంగా అక్రమ వలసదారుల గుర్తింపు కోసం అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఓ షాపింగ్ మాల్‌లో అధికారులు వర్క్ పర్మిట్ లేకుండా పనిచేస్తున్న వలసదారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నారు. వారిని బలవంతంగా లాక్కెళ్లి బంధిస్తున్నారు. స్దానికంగా ఉన్న అమెరికన్లు ఇస్తున్న సమాచారంతో అమెరికాలోని చాలా చోట్ల ఇలాంటి పరిస్ధితులే కనిపిస్తున్నాయి. దీంతో రెగ్యులర్‌గా వెళ్లే పార్ట్ టైమ్ ఉద్యోగాలకు అమెరికాలోని విదేశీయులు గుడ్ బై చెప్పేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా గత రెండేళ్లుగా వర్క్ పర్మిట్‌లపై దేశంలో ఉన్న ఇతరులు కూడా ఆందోళన చెందుతున్నారు.
అమెరికాలో షాపింగ్ మాల్స్ కాడ ఉన్న పరిస్థితి..( వర్క్ పర్మిట్ లేకుండా )
— MalathiReddyTDP (@ManaTDPfamily) February 17, 2025
ఇల్లీగల్ గా వర్క్ చేస్తున్న వారిని బంధిస్తున్న వీడియో pic.twitter.com/9PsiTNkE2j






