- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బికినీ వేసుకోవాలని ఆశపడ్డ భార్య.. రూ. 418 కోట్లు ఖర్చు చేసి ఆ పనిచేసిన భర్త!
సోషల్ మీడియాలో భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన ఓ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య బికినీ వేసుకోవాలని ఉందని భర్తతో చెప్పగా ఆమె కంఫర్ట్ కోసం ఏకంగా ఐలాండ్‌నే కొనిచ్చాడు భర్త. అవును.. అరబ్ మిలియనీర్ జమాల్ అల్ నడక్

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన ఓ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య బికినీ వేసుకోవాలని ఉందని భర్తతో చెప్పగా ఆమె కంఫర్ట్ కోసం ఏకంగా ఐలాండ్‌నే కొనిచ్చాడు భర్త. అవును.. అరబ్ మిలియనీర్ జమాల్ అల్ నడక్ వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. సొసైటీలో గొప్ప హోదా ఉంది. అయితే ఆయన భార్య సౌది అల్ నడక్ బికినీ వేసుకోవాలని, స్విమ్మింగ్ చేయాలని ఉందని చెప్పగా.. ఓ ప్రైవేట్ ఐలాండ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. సముద్రతీరంలో హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు, అసౌకర్యం లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాన్ని స్వయంగా సౌది అల్ నడక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలిపింది.
దాదాపు మూడు లక్షల మంది ఫాలోవర్లతో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఫేమ్ పొందిన ఆమె.. ఈ వారం తన భర్త తనపై ఎంత ఖర్చు చేశాడనే విషయంపై సిరీస్లు చేసేది. కాస్ట్‌లీ థింగ్స్, డైమండ్స్, జ్యువెల్లరీ, కళాఖండాలు ఇలా ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని కూడా చెప్పింది. ఈ రీల్ దాదాపు 24లక్షల వ్యూస్ పొందగా.. మస్త్ లైక్స్ పడిపోయాయి. తమ కమ్యూనిటీలో బికినీ ధరించడంపై ఆంక్షలు ఉంటాయని.. అందుకే ఇలాంటి గిఫ్ట్ ఇచ్చాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపిన ఆమె.. ఇది తనకు కంఫర్ట్ ఇవ్వడంతోపాటు తన భర్తకు స్థిరాస్థిగా ఉంటుందని చెప్పింది. కాగా కొంత మంది ఈ విషయంపై పొగడ్తల వర్షం కురిపిస్తే.. మరికొందరు మాత్రం ఎగతాళి చేశారు.






