- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అప్రైజల్ అడిగితే పల్లీలు వచ్చాయ్.. జోకులేస్తున్న జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్ సంస్థలు.. నెట్టింట వైరల్
ఏ రంగంలోనైనా ఉద్యోగులకు ఉండే కోరిక ఒక్కటే.

దిశ, వెబ్ డెస్క్: ఏ రంగంలోనైనా ఉద్యోగులకు (Employees) ఉండే కోరిక ఒక్కటే. ఏటా ప్రమోషన్లు, శాలరీ హైక్‌లు (Salary hike) ఉండాలని ఆశిస్తుంటారు. దీనికోసమే ఏడాదంతా కష్టపడి పనిచేస్తుంటారు. అయితే ఈ అవకాశాలు అందరికీ సమానంగా ఉండవు. ఉద్యోగులు యాన్యువల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా కంపెనీలు తమ ఉద్యోగులకు అప్రైజల్ (Appraisal) ఇస్తుంటాయి. ఇక ఎంత కష్టపడి పనిచేసిన ఆశించినట్లుగా అప్రైజల్ ఇవ్వకపోతే ఆ ఉద్యోగులు ఎంత నిరుత్సాహ పడుతారో మనకు తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో (Social media) విపరీతంగా మీమ్స్ కూడా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఉద్యోగుల అప్రైజల్ సీజన్ నడుస్తోంది. దీన్ని క్యాచ్ చేసుకుంటూ క్విక్ కామర్స్ సంస్థలు సరదాగా మోమెంట్ మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వేస్తున్నారు.
క్విక్ కామర్స్ సంస్థ జెప్టోలో (Zepto) అప్రైజల్ అని ట్రైప్ చేస్తే పల్లీలు చూపిస్తుంది. 'బ్రాండ్స్ ఎంత చక్కగా మోమెంట్ మార్కెటింగ్ చేస్తున్నాయ్.. అప్రైజల్ అని సెర్చ్ చేస్తే పల్లీలు వచ్చాయి. క్రేజీ కదా' అంటూ ఈ విషయాన్ని ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే, జెప్టో మాత్రమే కాదు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తూ పలువురు యూజర్లు అదే విషయాన్ని పంచుకుంటున్నారు. ఇక క్విక్ కామర్స్ చేసిన ఈ ఫన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. 'పోస్టు అప్రైజర్ ఎఫెక్ట్' అంటూ కొంతమంది కామెంట్లు పెట్టగా.. మరికొందరు మోమెంట్ మార్కెటింగ్‌ను ప్రశంసిస్తున్నారు.






