- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో కొత్త ట్రెండ్.. ఐస్ బాత్ థెరపీ విశేషాలవే!
ఐస్ బాత్.. చిన్నపాటి ఐస్ ముక్కలను ఒక బాత్ టబ్‌లో నింపి, ఆ నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు శరీరాన్ని ముంచి ఉంచుతారు.

దిశ, వెబ్ డెస్క్: ఐస్ బాత్ (Ice bath).. చిన్నపాటి ఐస్ ముక్కలను ఒక బాత్ టబ్‌లో నింపి, ఆ నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు శరీరాన్ని ముంచి ఉంచుతారు. దీనిని క్రయోథెరపీ లేదా కోల్డ్ వాటర్ ఇమ్మర్షన్ టెక్నిక్/కోల్డ్ ప్లంజ్ థెరపీ అని కూడా పిలుస్తారు. గత కొన్ని రోజులుగా ఈ ఐస్ బాత్ థెరపీకి (Ice bath therapy) విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం క్రీడాకారులు, సెలబ్రిటీలు మాత్రమే ఈ థెరపీని అనుసరించేవారు. అయితే ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఐస్ బాత్ థెరపీ తీసుకుంటున్న వీడియోలు వైరల్ కావడంతో యువతలో దీనిపై ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో ఫిట్‌నెస్ ప్రియులు ఈ ఐస్ బాత్ థెరపీని ఒక ట్రెండ్‌లాగా మార్చేశారు. వారాంతాల్లో ఐస్ బాత్‌లు తీసుకుంటూ, శరీరానికి శీతలతను అందిస్తూ, మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. దీంతో కొందరు ఈ ఐస్‌బాత్‌ను ఒక ఈవెంట్‌లా నగరంలోని కేఫ్స్, క్లబ్స్ వంటి విభిన్న ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు.
ఐస్ బాత్‌లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని సుమారు 10–15 నిమిషాల పాటు 10 నుంచి 15°C కంటే తక్కువ ఉష్ణోగ్రత గల నీటిలో ముంచితే.. మానసిక ఉల్లాసం, మజిల్స్ రికవరీ, వాపులు తగ్గడం, రక్త ప్రసరణ మెరుగవడం వంటి ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే, చల్లటి నీటిలో శరీరం ఉన్నప్పుడు ఎండార్ఫిన్లు విడుదలై, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పని ఐస్ బాత్‌తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా చల్లటి నీటి ప్రమేయంతో నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుంది. ఇది డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. అత్యంత చల్లటి నీటిలో ఒక మునక డోపమైన్ ఉత్పత్తిని 250% వరకూ పెంచుతుంది.
ఐస్ బాత్ థెరపీ వల్ల ప్రయోజనాలున్నప్పటికీ, ఇది అందరికీ సరిపడే చికిత్సా పద్ధతి కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హై బ్లడ్ ప్రెజర్, గుండె సంబంధిత సమస్యలున్నవారు ముందుగా వైద్య సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, ప్రారంభంలో 15 నుంచి 30 సెకన్ల పాటు మాత్రమే ఐస్ వాటర్ ఫేస్ డిప్‌లు చేయడం మంచిదని చెబుతున్నారు. ఆ తర్వాత వారి వారి ఇష్టం, సామర్థ్యాలను బట్టి వ్యవధి పెంచుకోవచ్చంటున్నారు. అలాగే, తరచూ ఐస్‌బాత్ చేయడం వలన శరీరానికి వ్యాయామం ద్వారా అందే శక్తి మందగిస్తుంది. అత్యంత చల్లని నీటిలో స్నానం చేస్తే కోల్డ్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐస్ బాత్ చేస్తున్న సమయంలో వేగంగా గాలి పీల్చుకోవడం వలన బ్లడ్ ప్రజర్ పెరిగే అవకాశం ఉంది. ఇది అనారోగ్యానికి దారి తీయవచ్చు. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.






