- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ రైల్వే హిస్టరీలో మరో కొత్త శకం.. నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ ట్రైన్ అదుర్స్
ముంబ్రా రైలు ప్రమాదం తర్వాత మేల్కొన్న భారత రైల్వే శాఖ.. ముంబైలో దేశంలోనే మొట్టమొదటి 'నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్' లోకల్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది.

దిశ, వెబ్‌డెస్క్: రద్దీ కారణంగా రైలు నుంచి కింద పడి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను అరికట్టడానికి, దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్’ (Non-AC Closed Door) లోకల్ రైలును ముంబై (Mumbai)లో భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఆ ట్రైన్‌కు సంబంధించి అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇటీవల ముంబ్రా సమీపంలో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తూ కింద పడి ప్రయాణికులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఆటోమేటిక్ తలుపులు కేవలం ఖరీదైన ఏసీ రైళ్లలో మాత్రమే ఉంటాయి. కానీ, సామాన్య ప్రయాణికులకు కూడా అదే స్థాయి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
కొత్త రైలు ప్రత్యేకతలు ఇలా..
రైలు కదిలే ముందు తలుపులు వాటంతట అవే మూసుకుంటాయి. దీంతో ప్రయాణికులు గేట్ల వద్ద వేలాడే అవకాశం ఉండదు. తలుపులు మూసి ఉన్నప్పుడు గాలి సరిగ్గా అందేలా ఈ నాన్-ఏసీ బోగీల్లో ప్రత్యేకంగా ఎయిర్ సర్క్యులేషన్ సిస్టమ్, ఫోర్స్డ్ వెంటిలేషన్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఈ రైలు తయారైంద. ఏసీ రైలు టికెట్ ధరలు సామాన్యులకు భారంగా ఉన్నందున, సాధారణ నాన్-ఏసీ ఛార్జీలకే ఈ క్లోజ్డ్ డోర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. తాజాగా నిర్ణయం వల్ల ముంబై లోకల్ రైళ్లలో ప్రతిరోజూ జరిగే ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని రైల్వే అధికారులు ఆశిస్తున్నారు. ప్రయోగాత్మక పరీక్షల అనంతరం ఈ రైలును సెంట్రల్ లేదా వెస్ట్రన్ లైన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.






