అనిరుధ్, కావ్యా మారన్ పెళ్లి.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. పెళ్లి వీడియో కూడా

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-14 14:01:10  IST  )

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజన్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇదే టాపిక్ నడుస్తోంది. ఈ ఇద్దరు

అనిరుధ్, కావ్యా మారన్ పెళ్లి.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. పెళ్లి వీడియో కూడా
X

దిశ, ఫీచర్స్ : యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజన్స్ ఓనర్ కావ్యా మారన్ ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇదే టాపిక్ నడుస్తోంది. ఈ ఇద్దరు ఇప్పటికే ఫారిన్‌ వెకేషన్‌కు కలిసి వెళ్లారని.. అక్కడే క్లోజ్‌గా వీరిని చూశామని కొందరు రూమర్స్ స్టార్ట్ చేశారు. ఇద్దరు సెలబ్రిటీలు కావడంతో ఈ గాసిప్ కాస్త ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇద్దరు జంటగా బాగుంటారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో మొత్తానికి ఈ టాపిక్‌కు ఒక్క ట్వీట్‌తో ఫుల్ స్టాప్ పెట్టేశాడు. స్వయంగా తానే ఈ ఇష్యూపై క్లారిటీ ఇచ్చాడు. ‘ పెళ్లా? చిల్ అవుట్ గాయ్స్.. రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఆపండి’ అంటూ పోస్ట్ పెట్టాడు.

‘రూమర్స్ క్లారిఫై చేశావ్ కదా.. ఇక కూలి ఫస్ట్ సింగిల్ ఇచ్చే పనిలో ఉండు’, ‘హమ్మయ్యా త్వరగా క్లారిటీ ఇచ్చి మంచి పని చేశావ్.. లేదంటే యూట్యూబ్‌లో మీ పెళ్లి వీడియో కూడా పెట్టేశేవారేమో’, ‘సింగిల్‌గా ఉండటమే బెటర్.. అనవసరంగా రిస్క్ తీసుకోకు’, ‘కావ్యా మారన్‌ను పెళ్లి చేసుకుంటే వాళ్ల నాన్న సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో వచ్చే అన్ని సినిమాలకు నువ్వే మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయాల్సి ఉంటుందేమో’, ‘జాగ్రత్త బ్రో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Anirudh Ravichander Twitter post

Next Story