- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీవ్ర వివాదంలో యాంకర్ శివజ్యోతి.. తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు
ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుమల (Tirumala) పవిత్రతను కాపాడేందుకు టీటీడీ (TTD) ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుమల (Tirumala) పవిత్రతను కాపాడేందుకు టీటీడీ (TTD) ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆలయ పరిధిలో భక్తులు ఎవరూ రీల్స్ చేయొద్దనే నిషేధాజ్ఞలు కూడా అమల్లో ఉన్నాయి. కానీ, కొందరు అజ్ఞానులు నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ.. ఆలయ పవిత్రతను మంటగలిపే విధంగా వ్యవహరిస్తున్నారు. వారు సాధారణ ప్రజలైతే తెలీక చేశారని అనుకోవచ్చు.. కానీ, తాజాగా ప్రముఖ యాంకర్ శివజ్యోతి (Anchor Shiva Jyothi) తిరుమల క్యూ లైన్‌లో నిలబడి శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా కామెంట్లు చేసింది. తాను చేసింది మంచి పని అన్నట్లుగా వీడియో తీసి ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల భర్త, స్నేహితులతో కలిసి యాంకర్ శివజ్యోతి తిరుమలకు వెళ్లింది. ఈ క్రమంలోనే వారు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్‌లో నిలబడగా.. భక్తుల కోసం సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే, ఆ ప్రసాదం తీసుకున్న శివజ్యోతి, ఆమె స్నేహితుడు ‘తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం’.. ‘రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే’ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు, హిందూ ధార్మిక సంఘాలు శివజ్యోతితో పాటు ఆమె స్నేహితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






