- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్రో రైల్‌లో మహిళల సీక్రెట్ వీడియో రికార్డింగ్.. అప్‌లోడింగ్ అక్కడే... ఐదు వేల మందికి పైగా..
స్త్రీని దేవతగా కొలిచే భారతదేశంలో.. ఆమెపై ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి. మానభంగాలు, హత్యలు, గృహ హింస, మానసిక దాడి.. ఒక్కటేమిటి ఒకరిని ఎన్ని రకాలుగా

దిశ, ఫీచర్స్ : స్త్రీని దేవతగా కొలిచే భారతదేశంలో.. ఆమెపై ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి. మానభంగాలు, హత్యలు, గృహ హింస, మానసిక దాడి.. ఒక్కటేమిటి ఒకరిని ఎన్ని రకాలుగా బాధపెట్టొచ్చో అన్ని రకాలుగా బాధపెడుతూనే ఉన్నారు. బాధపడుతూనే ఉంది. ఇక సోషల్ మీడియా జమానాకొస్తే వర్చువల్ కనెక్షన్స్‌తో బ్లాక్ మెయిల్స్ తప్పడం లేదు. కాగా సరికొత్తగా మరో కథ వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అమ్మాయిలను సీక్రెట్‌గా రికార్డ్ చేస్తూ.. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లో పెడుతున్నాడు. కొత్త సరుకు వచ్చిందనే క్యాప్షన్ ఇస్తూ ఫాలోవర్స్ పెంచుకుంటున్నాడు. ఇక ఈ ఇన్‌స్టా పేజీకి ఐదు వేలకు పైగా ఫాలోవర్స్ ఉండగా.. ఇది గమనించిన ఓ వ్యక్తి పేజీ గురించి చర్చిస్తూ బెంగళూరు పోలీస్‌ను ట్యాగ్ చేశాడు. ఈ విషయాన్ని బయటపెట్టాడు.
METRO CHICKS పేరుతో పేజీ రన్ అవుతుండగా... దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పేజీని రిమూవ్ చేశారు. కాగా ఈ సంఘటన పబ్లిక్ ట్రాన్సిట్‌లో లైంగిక వేధింపులు, ప్రైవసీకి సంబంధించిన సమస్యను హైలైట్ చేస్తుంది. టోక్యో, జకార్తా, మెక్సికో సిటీ వంటి నగరాల్లో మహిళలకు ప్రత్యేక క్యారేజీలు ఉన్నప్పటికీ.. ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం దొరకలేదు. ఇలాంటి ఘటనే సింగపూర్‌లో జరిగింది. ఉమా మాగేశ్వరి అనే మహిళ ఒక వ్యక్తి తనను మెట్రో రైలులో రహస్యంగా చిత్రీకరిస్తున్నట్లు గుర్తించింది. సాక్షాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. ఆ వ్యక్తి వద్ద ఇతర మహిళల అశ్లీల వీడియోలు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఓ వైపు ఆపరేషన్ సిందూర్ పేరుతో పక్కదేశంతో పోరాడుతుంటే.. సొంత దేశంలో ఇలాంటి పనులు చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక దీనిపై ఇప్పటికే చాలా మంది ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






