- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి ప్రేమకు అవధులు లేవని నిరూపించిన సంఘటన.. పిల్లల కోసం అసమాన్య పోరాటం!(వీడియో)
జీవితంలో కష్టపడనిదే ఏది రాదు.

దిశ,వెబ్‌డెస్క్: జీవితంలో కష్టపడనిదే ఏది రాదు. అందరి జీవితాలు ఒకే విధంగా ఉండవు. కొందరి జీవితం పూలపాన్పులా ఉంటే.. మరికొంతమంది జీవితం ముళ్ల రహదారిలా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో కష్టనష్టాలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటిని అధిగమించి ముందుకెళ్తేనే జీవితం పూలబాటలా మారుతుంటుంది. అయితే, ఈ కష్టాలను అందరూ ఎదుర్కోలేరు. కానీ.. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటేనే ఉన్నత స్థాయికి చేరుకోగలరు. ఈ తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
ఓ మహిళ తన కడుపున పుట్టిన పిల్లల్ని బతికించుకోవడానికి చేస్తున్న పోరాటం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో ఓ తల్లి తమ బిడ్డల భవిష్యత్తు కోసం, పొట్టకూటి కోసం కష్టపడుతూ కనిపించింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ‘‘తమ బిడ్డల కోసం తల్లి ఎల్లప్పుడూ శ్రమిస్తునే ఉంటుంది. ఏ ఫలితం ఆశించకుండా తల్లి కష్టపడుతుంటుంది, ‘‘నిజమే అందరి జీవితాలు ఒకేలా ఉండవు.. ఇక్కడ తన కడుపున పుట్టిన పిల్లల్ని బతికించుకోవడానికి ఆ తల్లి చేస్తున్న పోరాటం మాత్రం అసమాన్యం!’’ అని కామెంట్లు పెడుతున్నారు. వీడియో ఇదే..






