మగాళ్లందరూ రేపిస్టులే.. నిధి సంచలన ట్వీట్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-13 06:50:05  IST  )

ఆస్ట్రాలాజర్ నిధి చౌదరి భవిష్యత్తు గురించి చెప్పడం కన్నా మగాళ్లను టార్గెట్ చేస్తూ వీడియోలు చేయడమే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే దేశంలో పెరుగుతున్న రేప్ కేసుల గురించి సంచలన ట్వీట్ చేసింది. ‘పురుషులు స్త్రీలను రేప్ చేస్తారు.. పురుషులు పురుషులను రేప్ చేస్తారు..

మగాళ్లందరూ రేపిస్టులే.. నిధి సంచలన ట్వీట్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రాలాజర్ నిధి చౌదరి భవిష్యత్తు గురించి చెప్పడం కన్నా మగాళ్లను టార్గెట్ చేస్తూ వీడియోలు చేయడమే ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే దేశంలో పెరుగుతున్న రేప్ కేసుల గురించి సంచలన ట్వీట్ చేసింది. ‘పురుషులు స్త్రీలను రేప్ చేస్తారు.. పురుషులు పురుషులను రేప్ చేస్తారు.. పురుషులు జంతువులను రేప్ చేస్తారు. సోషల్ మీడియాలో ఉన్న మగాళ్లు కూడా ఇందుకు కారణం.. స్త్రీల పట్ల మీకున్న అగౌరవం.. ఓ అమ్మాయి ఇన్‌బాక్స్‌లో ఉన్న కామెంట్స్ మీ మెంటాలిటీ ఏంటో చూపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు న్యాయం కోసం అడుగుతున్నారు. స్త్రీలను టార్చర్ చేస్తూ సుపీరియర్ పవర్స్ ఉన్నట్లు ఫీల్ అయ్యే మీరు అందరూ రేపిస్టులే’ అంటూ ట్వీట్ చేసింది.

మరో ట్వీట్‌లో కుక్కలతో రేబీస్ వచ్చి చనిపోయిన వారికంటే పురుషులు చేసే క్రైమ్స్ వల్లే మరణించిన వారే ఎక్కువ అని.. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను ట్యాగ్ చేసిన ఆమె రేప్ క్యాపిటల్ ట్యాగ్ తీసేసేలా ఏదో ఒకటి చేయాలని కోరింది. ఇక నిధి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఎటాక్ చేస్తున్నారు నెటిజన్లు. సేమీ నేక్డ్ వీడియోలు చేస్తూ పురుషుల అటెన్షన్ క్యాచ్ చేసి, మగాళ్ల ఫాలోవర్స్‌ను పెంచుకునే నువ్వు ఇలాంటి కామెంట్స్ చేయడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. న్యూడ్ వీడియోలు చేసే నువ్వు.. మగాళ్లందరూ రేపిస్టులే అనడం పెద్ద జోక్ అని ఏకిపారేస్తున్నారు.

TWEET LINK

Next Story