అలేఖ్య చిట్టి సంచలన వీడియో.. మరో కొత్త వ్యాపారం అంటూ !

by velandi.Saikiran |   (  Updated:2025-07-25 05:53:53  IST  )

అలేఖ్య చిట్టి పికిల్స్ ( Alekhya Chitti Pickles)... ఈ పేరు గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వింటున్న స

అలేఖ్య చిట్టి సంచలన వీడియో.. మరో కొత్త వ్యాపారం అంటూ !
X

దిశ, వెబ్ డెస్క్: అలేఖ్య చిట్టి పికిల్స్ ( Alekhya Chitti Pickles)... ఈ పేరు గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వింటున్న సంగతి తెలిసిందే. పచ్చళ్ళ పేరుతో... మార్కెట్లోకి వచ్చిన అలేఖ్య చిట్టి పికిల్స్ బృందం... బాగా ఫేమస్ అయింది. ఓ కస్టమర్ కామెంట్ చేసినందుకు...అదే సమయంలో అలేఖ్య ( Alekhya ) బూతులతో రెచ్చిపోయింది. దింతో అలేఖ్య చిట్టి పికిల్స్ దుకాణం మూసివేయాల్సి వచ్చింది. అటు అక్కాచెల్లెళ్లను... సోషల్ మీడియాలో ఏకిపారేశారు జనాలు.

వాళ్లపై ట్రోలింగ్స్, మీమ్స్ క్రియేట్ చేసి ఒక ఆట ఆడుకున్నారు. దీంతో అలేఖ్య ఆస్పత్రి పాలు కూడా అయింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ వివాదం సద్దుమణుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో అలేఖ్య సిస్టర్స్ లో ఒకరైన రమ్య ( Ramya)... కొత్త బిజినెస్ అంటూ సంచలన వీడియో రిలీజ్ చేసింది. పికిల్స్ బిజినెస్ తో చాలా సక్సెస్ అయ్యామని పేర్కొన్న రమ్య... అలేఖ్య కారణంగా.. నష్టపోయినట్లు కూడా పేర్కొంది. ఇప్పుడు మళ్లీ బిజినెస్ లో కం బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు రమ్య కంచర్ల ప్రకటన చేశారు.

రమ్య మోక్ష పికిల్స్ ( Ramya Moksha Pickles ) పేరుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు రమ్య కంచర్ల. గతంలో జరిగిన తప్పిదాలను ఇకపైన.. అసలు చేయబోమని కూడా వెల్లడించారు. తమ కొత్త వ్యాపారంలో అలేఖ్యను భాగస్వామ్యం చేయబోమని.. కూడా క్లారిటీ ఇచ్చారు రమ్య. వ్యాపారం మొత్తం నేనే చూసుకుంటానని కూడా వెల్లడించింది. మార్కెట్లోకి... వెళ్తే మాకు ప్రతికూల పరిస్థితులు వస్తాయి.. కానీ ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. మరి త్వరలోనే రాబోతున్న రమ్య మోక్ష పికిల్స్ వ్యాపారం.. ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

Link

Next Story