- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alekhya Chitti Pickles : సెలబ్రిటీ అయిపోయిన పచ్చళ్ల పాప.. ఆ హీరోకు హీరోయిన్‌గా ఫిక్స్.. ఆఫర్ ఇచ్చింది ఆ ప్రముఖ నిర్మాతనే..
అలేఖ్య చిట్టి పికిల్స్.. ఓ బ్రాండ్. పాజిటివ్‌గా కాదు నెగెటివ్‌గా. ఏదైనా వ్యాపారం చేస్తే కస్టమర్‌ను దేవుడిగా భావిస్తారు కానీ ఈ పచ్చళ్ల బిజినెస్ చేసే అక్కాచెల్లెళ్లు మాత్రం నువ్వెంత అని ట్రీట్ చేస్తరు. కొంటే కొను లేదంటే పో అని బూతులు తిడుతరు.

దిశ, ఫీచర్స్ : అలేఖ్య చిట్టి పికిల్స్.. ఓ బ్రాండ్. పాజిటివ్‌గా కాదు నెగెటివ్‌గా. ఏదైనా వ్యాపారం చేస్తే కస్టమర్‌ను దేవుడిగా భావిస్తారు కానీ ఈ పచ్చళ్ల బిజినెస్ చేసే అక్కాచెల్లెళ్లు మాత్రం నువ్వెంత అని ట్రీట్ చేస్తరు. కొంటే కొను లేదంటే పో అని బూతులు తిడుతరు. ఇలాంటి ఓ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పెట్టడంతో పరువంతా పోయింది. బిజినెస్ కాస్త క్లోజ్ అయింది. అప్పటి వరకు సెలబ్రిటీలుగా ఉన్న అక్కాచెల్లెళ్లు.. అమాంతం లోయలో పడినట్లు ఫీల్ అయిపోయారు. ఇక రమ్యను టార్గెట్ చేసిన నెటిజన్లు.. ఆస్పత్రి పాలయ్యే వరకు వదల్లేదు. చివరకు ఓ పదిహేను రోజుల తర్వాత వారిని వదిలిపెట్టిన నెటిజన్లు.. మళ్లీ కార్నర్ చేస్తున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఓ సినిమా ఈవెంట్‌లో రమ్య కనిపించగా.. పచ్చళ్లు అమ్ముకునేటోళ్లు కూడా హీరోయిన్స్ అయిపోతున్నారని విమర్శిస్తున్నారు. పచ్చళ్ల వ్యాపారం వల్ల వచ్చిన ఫేమ్‌ను బాగానే వినియోగించుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆమె ఇంతకు ముందే సినిమాల్లో ట్రై చేసిందని.. అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో పచ్చళ్లు అమ్ముతూ, రీల్స్ చేస్తూ ఫేమ్ సంపాదించుకుందని ఇంకొందరు చెప్తున్నారు. ‘పచ్చళ్ల పాప సెలబ్రిటీ అయిపోయింది’, ‘ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎస్ ఆల్రెడీ సెట్ చేసి ఉంటడు.. నెక్స్ట్ ఆనంద్ దేవరకొండ మూవీ హీరోయిన్‌గా ఫిక్స్ చేసి ఉంటడు’ అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.






