కుప్ప కూలిన ఎయిరిండియా విమానం.. వైరల్‌గా లైవ్ దృశ్యాలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-14 15:23:34  IST  )

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.

కుప్ప కూలిన ఎయిరిండియా విమానం.. వైరల్‌గా లైవ్ దృశ్యాలు
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిరిండియాకు (Air India) చెందిన AI-171 బోయింగ్ 787-8 డ్రీంలైనర్ విమానం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ (London) గాట్విక్‌కు బయలుదేరింది. మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే సాంకేతిక లోపం వల్ల మేఘానిలో సివిల్‌ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిపోయింది. ప్రమాదం జరిగిన విమానంలో 232 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. కాగా, విమానం అదుపుతప్పి నేలకూలే సమయంలో స్థానిక ప్రజలు తమ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. విమానం ఒక్కసారిగా బ్లాస్ట్ అయి భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగ ఎగసిపడటం వీడియోల్లో చూడొచ్చు.

Click Here For Video!

Next Story