అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మనుషులు మాంసపు ముద్దలైపోయారు.. కానీ చెక్కు చెదరని భగవద్గీత పుస్తకం (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-13 12:44:58  IST  )

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్‌లో ఒక్కరు తప్ప ప్రయాణికులంతా చనిపోయారు. ఇంజిన్లు ఫెయిల్ కావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుండగా..

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. మనుషులు మాంసపు ముద్దలైపోయారు.. కానీ చెక్కు చెదరని భగవద్గీత పుస్తకం (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్‌లో ఒక్కరు తప్ప ప్రయాణికులంతా చనిపోయారు. ఇంజిన్లు ఫెయిల్ కావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుండగా.. ఘటన తీవ్రతకు మనుషులు మాంసపు ముద్దలుగా మారిపోయారు. మరణించిన వారిని గుర్తించేందుకు కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ కూడా అడిగారు అధికారులు. అయితే ఈ విమానంలోనే ఓ ప్రయాణికుడు భగవద్గీతను తీసుకుని వెళ్తుండగా.. ఆ పుస్తకానికి మాత్రం ఏమీ కాలేదు. చెక్కు చెదరకుండా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు షాక్ అవుతున్నారు. భగవద్గీత సారాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

జీవితం కొన్నిసార్లు ఎంత అనిశ్చితంగా, అన్యాయంగా ఉంటుందో ఈ ప్రమాదాన్ని చూస్తే అర్థమవుతుందని.. మనం ఎవరైనా సరే, విధి ఎవరినీ వదలదని చెప్తున్నారు. ‘మృత్యు సత్య్ హై’, ‘భగవద్గీతతో పాటు భక్తులు కూడా బతికితే బాగుండేది.. అందరూ చనిపోయి పుస్తకం మిగలడం వల్ల లాభం ఏంటి’, ‘ఆయుధాలు ఆత్మను కోయలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు... ఈ ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’, ‘భగవద్గీతను కాపాడి.. భక్తుడిని కాపాడలేకపోయిన దేవుడు.. ఇది ఫౌల్ ప్లే కదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story