అఘోరి, వర్షిణి సెల్ఫీ వీడియో.. ఆత్మహత్య చేసుకుంటామంటూ !

by velandi.Saikiran |

లేడీ అఘోరీ ( Lady Aghori), వర్షిణి ( Sri Varshini) సంచలన ప్రకటన చేశారు. మేమిద్దరం ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటామని.. సెల్

అఘోరి, వర్షిణి సెల్ఫీ వీడియో.. ఆత్మహత్య చేసుకుంటామంటూ !
X

దిశ, వెబ్ డెస్క్: లేడీ అఘోరీ ( Lady Aghori), వర్షిణి ( Sri Varshini) సంచలన ప్రకటన చేశారు. మేమిద్దరం ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటామని.. సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించారు. దీనికి సంబంధించిన... వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ( AP), తెలంగాణలో ( Telangana) సంచలనం సృష్టిస్తున్న... లేడీ అఘోరీ అలాగే వర్షిణి ఇద్దరు ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీరిద్దరి పెళ్లి పైన పెద్ద దుమారం నడుస్తోంది.

వర్షిణి కుటుంబ సభ్యులు, సాధువులు, లేడీ అఘోరీ మొదటి భార్య అందరూ... వరుసగా కేసులు పెట్టిన నేపథ్యంలో... ఈ వివాదం మరింత రాజుకుంది. దీంతో లేడీ అఘోరీ, వర్షిణి దంపతులను అరెస్టు చేస్తారని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. సెల్ఫీ వీడియో చేస్తూ లేడీ అఘోరీ, వర్షిణి దంపతులు సంచలన ప్రకటన చేశారు. తమ జోలికి ఎవరైనా వస్తే ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు నూతన దంపతులు.

ఇకపైన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి అస్సలు రాబోమని ప్రకటించారు. మేము కేదార్నాథ్ ( Kedarnath ) వెళ్ళిపోతున్నామని కూడా స్పష్టం చేశారు. జీవితాంతం అక్కడే ఉంటామని కూడా క్లారిటీ ఇచ్చారు ఈ కొత్త దంపతులు. తమ జీవితాన్ని తాము.. ముందుకు సాగిస్తామని... మధ్యలో ఎవరైనా తమను విడదీస్తే ఆత్మహత్య చేసుకోవడం గ్యారంటీ అంటూ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Next Story