- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral Video : యజమాని అంత్యక్రియల్లో పాల్గొన్న ఎద్దు.. కన్నీరు పెట్టుకుంటూ వీడ్కోలు..
రైతుతో ఎద్దుకు తండ్రీకొడుకుల సంబంధం ఉంటుందంటారు. రైతు తన వ్యవసాయాన్ని నిలబెట్టే ఎద్దును కన్నకొడుకులాగా చూసుకుంటాడు. తండ్రి పంచే ఆప్యాయతను పంచుతాడు. అందుకే ఈ బంధంలో ఏ ఒక్కరు దూరమైనా మరొకరికి కన్నీరే మిగులుతుంది.

దిశ, వెబ్ డెస్క్ : రైతుతో ఎద్దుకు తండ్రీకొడుకుల సంబంధం ఉంటుందంటారు. రైతు తన వ్యవసాయాన్ని నిలబెట్టే ఎద్దును కన్నకొడుకులాగా చూసుకుంటాడు. తండ్రి పంచే ఆప్యాయతను పంచుతాడు. అందుకే ఈ బంధంలో ఏ ఒక్కరు దూరమైనా మరొకరికి కన్నీరే మిగులుతుంది. ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృద్ధుడైన రైతు చనిపోవడంతో గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు అందరూ కడసారి చూసినట్లుగానే.. ఆ రైతుకు సంబంధించిన ఎద్దుకు కూడా ఆయనను చూపించారు.
దీంతో ఆ ఎద్దు కన్నీరు పెట్టుకోవడం అక్కడ ఉన్నవారందరినీ కలిచి వేసింది. హృదయం ద్రవించేలా ఏడ్చిన ఎద్దు.. మొత్తానికి ఆ రైతుకు కన్నీటితో వీడ్కోలు పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఇంతకు మించి ఈ జన్మకు ఏం కావాలి అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. డబ్బు, హోదా, పలుకుబడి అని పరుగులు పెట్టే జనాలంతా.. ఈ వీడియో చూసి ఇప్పటికైనా మానవత్వం, బంధం అంటే ఏంటో గుర్తిస్తారని అనుకుంటున్నామని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.






