తజికిస్తాన్ లో తెలుగోడి క‌ష్టాలు..ఫ్రీగా భోజ‌నం పెట్టిన ఆఫ్ఘనిస్తాన్ !

by velandi.Saikiran |

రామ్ ఇండియన్ అని గుర్తించిన హోటల్ యజమాని.. ఉచితంగానే భోజనం పెట్టాడు. , తీసుకోలేదు ఆ ఆఫ్ఘనిస్తాన్ హోటల్ యజమాని

తజికిస్తాన్ లో తెలుగోడి క‌ష్టాలు..ఫ్రీగా భోజ‌నం పెట్టిన ఆఫ్ఘనిస్తాన్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలుగు ట్రావెల‌ర్ రామ్ గురించి తెలియని వారు ఉండరు. యూట్యూబర్ అన్వేష్ సహాయ సహకారాలతో ట్రావెలింగ్ ప్రారంభించిన రామ్, ఇప్పుడు సక్సెస్ బాటలో పడ్డాడు. మొదట్లో విదేశాల్లో సైకిల్ పై యాత్ర చేసి, అష్ట కష్టాలు పడ్డ రామ్... ప్రస్తుతం తజికిస్తాన్ లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో సైకిల్ యాత్ర ఆపేసి, అన్వేష్ లాగే దేశాలు తిరగడం మొదలుపెట్టాడు రామ్‌. ఒక్కో దేశంలో వారం రోజులు ఉండి, ఆ తర్వాత మరో దేశానికి వెళుతున్నాడు. అలా ఈ సంవత్సరంలో దాదాపు 200 దేశాలు తిరగాలన్న లక్ష్యంతో దూసుకు వెళ్తున్నాడు రామ్. అయితే ప్రస్తుతం తజికిస్తాన్ లో ఉన్న ట్రావెలర్ రామ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ఆకలితో ఉన్న రామ్, ఓ ఆఫ్ఘనిస్తాన్ హోటల్ కు వెళ్లాడు.

ఈ సందర్భంగా రామ్ ఇండియన్ అని గుర్తించిన హోటల్ యజమాని.. ఉచితంగానే భోజనం పెట్టాడు. తాను డబ్బులు ఇస్తానన్నా కూడా, తీసుకోలేదు ఆ ఆఫ్ఘనిస్తాన్ హోటల్ యజమాని. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో... చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అలాగనే ఉన్నాయి. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ కు ఫుల్ సపోర్ట్ గా నిలుస్తోంది ఇండియా. మన ఇండియా సపోర్ట్ తో అటు పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది ఆఫ్గనిస్తాన్. ఈ నేపథ్యంలోనే భారతీయులను ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఆరాధిస్తున్నారు. మనోళ్లు ప్రపంచంలో ఏ మూలన కనిపించినా, సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తజికిస్తాన్ లో రామ్ కు ఫ్రీ భోజ‌నం ల‌భించింది. క్లిక్

Next Story