- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Actress Sumaya : వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో నా రిలేషన్ ఇదేనన్న ప్రముఖ హీరోయిన్
ప్రముఖ తెలుగు హీరోయిన్ మాజీ వైసీపీ ఎమ్మెల్యేతో ఉన్న రిలేషన్ ను కుండబద్దలు కొట్టింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ తెలుగు హీరోయిన్ మాజీ వైసీపీ ఎమ్మెల్యేతో ఉన్న రిలేషన్ ను కుండబద్దలు కొట్టింది. ఆయనతో నా రిలేషన్ ఇదేనంటూ హీరోయిన్ సుమయా రెడ్డి(Actress Sumaya Reddy) సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే అంతక ముందు వైఎస్సార్‌సీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(YCP former MLA Prakash Reddy)తో సుమయా క్లోజ్ గా ఉన్న వీడియో ఒకటి సోమవారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వారిద్దరికీ ఏదో సంబంధం ఉందంటూ పలు యూట్యూబ్ ఛానల్స్ కథనాలు ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో అసలు ఆ మాజీ ఎమ్మెల్యేకు తనకు ఉన్న సంబంధం గురించి నటి సుమయా నోరు విప్పింది. ఈ వ్యవహారంపై ఓ వీడియోను విడుదల చేసింది.
వైఎస్సార్‌సీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తనకి రిలేషన్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు(Family Relations) ఉన్నాయని, ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్ళే బంధాలున్నాయని, అన్ని పండగలు, కార్యక్రమాలు కలిసే చేసుకుంటామని వెల్లడించింది. ఒక ఫోటో వీడియో ఆధారంగా.. తన క్యారెక్టను దిగజార్చేలాగా వ్యవహరించొద్దన్నారు. ఒక అమ్మాయి.. అందులోనూ తెలుగు అమ్మాయిని అని కూడా చూడకుండా రాజకీయ రచ్చలోకి తనని లాగవద్దని ఆవేదన వ్యక్తం చేసింది. తనను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నవారు దయచేసి ఈ విషయాన్ని గమనించాలని కన్నీటి పర్యంతం అయింది అమ్మడు. కాగా ప్రకాష్ రెడ్డికి, సుమయాకు ఉన్న రివలేషన్ గురించి ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






