అమ్మాయిలూ.. కామాన్ని కంట్రోల్ చేసుకోండి.. రూంలకు అస్సలు వెళ్లకండి: శ్రీరెడ్డి

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-31 06:49:25  IST  )

అత్యంత పచ్చిగా, అందరికీ అర్థమయ్యే భాషలో సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి పోస్టు పెట్టింది.

అమ్మాయిలూ.. కామాన్ని కంట్రోల్ చేసుకోండి.. రూంలకు అస్సలు వెళ్లకండి: శ్రీరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: నూతన సంవత్సరం వేళ పెళ్లి కాని అమ్మాయిలకు నటి శ్రీరెడ్డి(Actress Sri Reddy) కీలక సూచనలు చేసింది. అత్యంత పచ్చిగా, అందరికీ అర్థమయ్యే భాషలో సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. ‘‘పిలవగానే ఎగేసుకుంటూ హోటల్ రూమ్‌కు వెళ్లటం కాదు.. దూరంగా ఉండి ప్రేమిస్తూ, కామాన్ని కంట్రోల్లో పెట్టుకున్న ఆడవాళ్లను మాత్రమే అబ్బాయిలు గౌరవిస్తారు. పడుకునే అమ్మాయిలను వాడుకుంటారు తప్పా.. వందకు 98 శాతం ఎవడూ పెళ్లి చేసుకోడు. మోసపోయాక ఏడ్చే కంటే.. ప్రేమలో ఉన్నప్పుడే కామాన్ని కంట్రోల్ చేసుకుంటే బాగుపడతారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రేమలో కామాన్ని మిక్స్ చేయకండి’’ అని పోస్టులో పేర్కొన్నారు. శివాజీ మహిళల బట్టలపై చేసిన వ్యాఖ్యలపైనా ఇటీవల శ్రీరెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. శివాజీ చెప్పిన విషయం మంచిదే అయినా.. సరైన విధంగా చెప్పలేదని సీరియస్ అయింది. నోరు కంట్రోల్‌లో పెట్టుకోవాలని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఈ వివాదం ఇంకా ముగియకముందే.. యువతులను ఎడ్యుకేట్ చేస్తూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.

Next Story