- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Actress Mamatha Kulakarni : సన్యాసిగా మారిన నటి మమతా కులకర్ణి మరో సంచలన నిర్ణయం
బాలీవుడ్ ఒకప్పటి హాట్ బ్యూటీ నటి మమతా కులకర్ణి(Actress Mamatha Kulakarni) జనవరి 24న ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా(PrayagRaj MahakumbhaMela)లో సన్యాసిగా మారి సంచలనం రేపారు.

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ ఒకప్పటి హాట్ బ్యూటీ నటి మమతా కులకర్ణి(Actress Mamatha Kulakarni) జనవరి 24న ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా(PrayagRaj MahakumbhaMela)లో సన్యాసిగా మారి సంచలనం రేపారు. తన పేరును 'శ్రీ యమై మమతా నందగిరి'గా మార్చుకొని సాధ్విగా తన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించారు. సాధ్విగా మారిన తర్వాత కులకర్ణికి 'కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్' పదవి బాధ్యతలు అప్పజెప్పారు. అయితే ఆమెకు కీలక బాధ్యతలు ఇవ్వడంపై అఖాడా పెద్దల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి రాజీనామా(Resignation) చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధ్విగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు.
కుంభమేళా సందర్భంగా సాధ్విగా మారిన కులకర్ణికి అఖాడా బాధ్యతలు అప్పజెప్పడమే కాకుండా.. మహామండలేశ్వర్ బిరుదు కూడా ఇవ్వడంతో గొడవకు బీజం పడింది. బాబా రాందేవ్(Baba Ramdev), పలు అఖాడాల పెద్దలతో సహ అనేక మంది సాధువులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నార్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య తీవ్ర స్థాయిలో వివాదం జరిగినట్టు సమాచారం. యోగా గురువు బాబా రామ్‌దేవ్.. ఆమెకు గతంలో నేర చరిత్ర ఉందని.. అలాంటి వ్యక్తిని మహామండలేశ్వర్ బిరుదు ఇవ్వడం ద్వారా మీరు సనాతన ధర్మానికి ఎలాంటి గురువును అందిస్తున్నారు.? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'నేను నా చిన్నతనం నుంచి సాధ్విని, అలాగే ఉంటాను' అని అన్నారు.






